అఖిల్‌కు జోడిగా ‘గ్యాంగ్ లీడర్’ బ్యూటీ.!

అక్కినేని అఖిల్ లేటెస్ట్‌గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హిట్ దక్కని అఖిల్.. ఈ సినిమాపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించినా.. అవి వట్టి రూమర్లని తేలిపోయాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ‘గ్యాంగ్ లీడర్’లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. దాదాపు […]

  • Ravi Kiran
  • Publish Date - 7:43 pm, Mon, 29 July 19
అఖిల్‌కు జోడిగా 'గ్యాంగ్ లీడర్' బ్యూటీ.!

అక్కినేని అఖిల్ లేటెస్ట్‌గా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌తో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు హిట్ దక్కని అఖిల్.. ఈ సినిమాపై మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కాస్టింగ్ ఫిక్స్ అయింది. కానీ హీరోయిన్ మాత్రం ఫైనల్ కాలేదు. ఇప్పటికే పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించినా.. అవి వట్టి రూమర్లని తేలిపోయాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘గ్యాంగ్ లీడర్’లో నటిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. దాదాపు ఈ అమ్మాయి ఖరారైనట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌ జోడీని పూర్తి లవ్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు భాస్కర్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.