కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌దే.. ఆదేశ ప్రజలే పాకిస్థాన్‌పై తిరగబడే రోజులు వస్తాయన్న విజయ్‌ దేవరకొండ!

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై నటుడు విజయ్ దేవరకొండ తీవ్ర స్థాయిలో స్పందించారు. భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రజలే బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వాలపై విరక్తి చెంది..రాబోయే రోజుల్లో ఆదేశ ప్రజలే వారిపై తిరగబడతారన్నారు.

కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌దే.. ఆదేశ ప్రజలే పాకిస్థాన్‌పై తిరగబడే రోజులు వస్తాయన్న విజయ్‌ దేవరకొండ!
Vijay

Updated on: Apr 27, 2025 | 5:43 PM

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి భారతదేశం మొత్తాన్ని కలిచివేసింది. 28 మంది అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ముష్కలను తలుచుకుంటే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రతి భారత పౌడురు ఈ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా సినీ నటుడు విజయ్ దేవరకొండ సైతం ఈ ఉగ్రదాడిపై తీవ్రంగా స్పందించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడులకు పాల్పడుతున్న పాకిస్థాన్‌కు ఆ దేశ ప్రజలే బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయని ఆయన అన్నారు. పాకిస్థాన్‌ ప్రభుత్వంపై విరక్తి చెంది..రాబోయే రోజుల్లో ఆదేశ ప్రజలే వారిపై తిరగబడతారన్నారు.

కాశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని, అక్కడి ప్రజలు భారతీయులేనని విజయ్‌ దేవరకొండ స్పష్టం చేశారు.
చదువు లేకపోవడమే కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాలకు కారణమని.. వాళ్లందరికీ చదువు చెప్పించి, బ్రెయిన్‌వాష్‌ కాకుండా చేయాలన్నారు. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్‌ లేక ఇబ్బంది పడుతుంటే..ప్రభుత్వాలు వాటి సంగతి చూసుకోకుండా.. భారత్‌పై దాడులు చేసి ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదన్నారు. పాకిస్థాన్‌పై ఇండియా దాడి చేయాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు పోతే, ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారని ఆయన అన్నారు.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ‘రెట్రో’ (Retro) సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ ఈ వ్యాఖ్యలు చేశారు. సూర్య (Suriya) కథానాయకుడిగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ “రెట్రో” చిత్రం మే 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..