Vijay Deverakonda: విజయ్ మూవీ కోసం.. పూరీ సంచలన నిర్ణయం..!

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నారు విజయ్.

Vijay Deverakonda: విజయ్ మూవీ కోసం.. పూరీ సంచలన నిర్ణయం..!

Edited By:

Updated on: Feb 27, 2020 | 8:34 PM

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు వరుసగా రెండు ఫ్లాప్‌లు పడ్డాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నారు విజయ్. దానికి తోడు ఈ మూవీని హిందీలో కూడా విడుదల చేయనుండగా.. ఈ సారి తన ఇమేజ్‌ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వకూడదని విజయ్ అనుకుంటున్నారు. ఇక విజయ్ ఫ్లాపుల నేపథ్యంలో దర్శకుడు పూరీ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా తన సినిమాల షూటింగ్‌ను 90 రోజుల్లోనే పూర్తి చేసే అలవాటున్న పూరీ.. విజయ్ మూవీ విషయంలో మాత్రం నిదానమే ప్రధానం అంటున్నారట. మరోవైపు ఇస్మార్ట్ శంకర్‌తో తనకు గ్రేట్ కమ్‌బ్యాక్ రాగా.. ఆ సక్సెస్‌ను ఫైటర్‌తో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారట. దీంతో స్క్రిప్ట్‌ మొదలు మిగిలిన విషయాల్లోనూ ఎక్కువ రోజులే కేటాయిస్తూ వస్తున్నారట పూరీ. అందులో భాగంగా షూటింగ్‌కు 120 రోజులు కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను అనుకున్న ఔట్‌పుట్‌ కోసం చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నారట పూరీ. కాగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోన్న విషయం తెలిసిందే.

Read This Story Also: ఆ నిర్మాత కష్టాలను విజయ్ వింటారా..!