Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 8 లక్షల 78 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 878254. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 301609. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 553471. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23174. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • భవిష్యవాణి లో స్వర్ణలత. భక్తులు 5వారాల పాటు శాఖ పోయాలి. పప్పు బెల్లాలతో ప్రతి గడప నుండి నాకు పూజ చేయాలి. నాకు ఈ ఏడు సంతోశమ్ లేదు. ఎవరు చేసుకుంది వారు అనుభవించాల్సిందే. నా ప్రజలని నేను కాపాడత.
  • తూర్పుగోదావరి జిల్లా : జగ్గంపేట నియోజకవర్గం కాపుసోదరులకు మాజీ మంత్రి ముద్రగడ బహిరంగ లేఖ. కాపు ఉద్యమం నుండి తప్పుకోవాలని నిర్ణయించు కొన్నా.. ముద్రగడ . ఇటీవల కొంతమంది సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ల నాపై దాడులు చేస్తున్నారు... ముద్రగడ . నన్ను కులద్రోహి గజదొంగ వంటి మాటలతో విమర్శిస్తున్నారు.. ముద్రగడ . నేను ఉద్యమం లో వసూలు చేసిననిధులు వారికి పంచలేదనా ఆ దాడులు... ముద్రగడ .
  • కరోనా వైరస్ నేపద్యంలో జైల్ లో ఉన్న ఖైదీలను విడుదల చేయాలని హైకోర్టు లో పిల్ . రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలంటూ పిల్ లో పేర్కొన్న పిటిషనర్ లింగయ్య . ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పెరోల్ పై విడుదల చేస్తున్నారని, తెలంగాణలో కూడా విడుదల చేసేలా . ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్న పిటిషనర్ . మరి కొద్ది సేపటిలో విచారణ చేయున్న హైకోర్టు.
  • గాంధీలో నాలుగో రోజు కొనసాగుతున్న నర్సుల సమ్మె. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్చలతో ఏకీభవించని నర్సులు. విధులు బహిష్కరించిన 200 మంది నర్సులు. ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా అవుట్ సోర్సింగ్ ద్వారా హెడ్ నర్స్ పదోన్నతి పై మండిపాటు.
  • బాలీవుడ్‌లో మరో విషాదం. ముంబై: బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మోడల్, నటి, గాయని దివ్య చోక్సీ (29) కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్య అకాల మరణంపై పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

Vijay Deverakonda: ఆ నిర్మాత కష్టాలను విజయ్ వింటారా..!

World Famous Lover collections, Vijay Deverakonda: ఆ నిర్మాత కష్టాలను విజయ్ వింటారా..!

ఇటీవల వరల్డ్ ఫేమస్ లవర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఎన్నో అంచనాల మధ్య ఈ నెల 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అటు విజయ్‌, ఆయన అభిమానులే కాదు..  ముఖ్యంగా ఈ మూవీపై నిర్మాత కేఎస్ రామారావు చాలా అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ క్రేజ్ దృష్ట్యా తనకు మంచి లాభాలు వస్తాయని ఆయన భావించారు. అయితే సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించకలేకపోయింది. దీంతో అటు నిర్మాత, ఇటు బయ్యర్లకు దారుణ నష్టాలు వచ్చాయి.  ఇక బయ్యర్లను ఆదుకునే స్థితిలో నిర్మాత రామారావు కూడా ఇప్పుడు లేరు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు విజయ్‌ను కలవాలని రామారావు అనుకుంటున్నారట.

ఇప్పుడు బయ్యర్లను ఆదుకోకపోతే.. భవిష్యత్‌లో రామారావు సినిమాలు తీయడం ఇబ్బంది అవుతుంది. అందుకే విజయ్‌తో చర్చించి.. ఎంతోకొంత వారిని ఆదుకోవాలనే విషయంపై చర్చించాలని అనుకుంటున్నారట. కానీ మరోవైపు ఈ విషయంపై విజయ్ సానుకూలంగా స్పందించే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా కోసం విజయ్‌కు రామారావు పూర్తి రెమ్యునరేషన్‌ ఇవ్వలేదట. కొంత పారితోషికం బకాయి పెట్టి, దానికి బదులు ఏవో ఫ్లాట్ పేపర్లు ఇచ్చారట. ఇక తనకే పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వనప్పుడు బయ్యర్లను విజయ్ ఆదుకోవడం కష్టమేనని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్లు టాక్.

Related Tags