‘బాహుబలి’కి దక్కంది.. ‘కామ్రేడ్’కు దక్కింది!

దర్శకధీరుడు రాజమౌళి కళాసృష్టి ‘బాహుబలి’. ఈ సినిమా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడమే కాదు.. ఎన్నో రికార్డులు.. ఆపై అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతటి గొప్ప సినిమా అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ అయింది కానీ.. కన్నడంలో మాత్రం విడుదల కాలేదని తెలిసిన విషయమే. అయితే ‘బాహుబలి’కి దక్కని ఆ అదృష్టం రౌడీ విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు దక్కబోతోంది. ఈ సినిమా జూలై 26న దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రిలీజ్ […]

బాహుబలికి దక్కంది.. కామ్రేడ్కు దక్కింది!

Updated on: Jul 22, 2019 | 8:44 PM

దర్శకధీరుడు రాజమౌళి కళాసృష్టి ‘బాహుబలి’. ఈ సినిమా తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం మొత్తం తెలిసేలా చేయడమే కాదు.. ఎన్నో రికార్డులు.. ఆపై అవార్డులను సొంతం చేసుకుంది. ఇంతటి గొప్ప సినిమా అన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ అయింది కానీ.. కన్నడంలో మాత్రం విడుదల కాలేదని తెలిసిన విషయమే. అయితే ‘బాహుబలి’కి దక్కని ఆ అదృష్టం రౌడీ విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమాకు దక్కబోతోంది.

ఈ సినిమా జూలై 26న దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ అండ్ కో నాలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్‌ను సైతం చేశారు. ఇక విజయ్ మాట్లాడుతూ ‘ ఈ అరుదైన అవకాశం ‘బాహుబలి’కి దక్కనిది తన ‘డియర్ కామ్రేడ్’కు దక్కినందుకు సంతోషంగా ఉందని.. అంతేకాకుండా కొంచెం భయంగా కూడా ఉందని అన్నాడు.  ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకుడు.