Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..

|

Jan 14, 2022 | 11:07 PM

Vijay Devarakonda: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చిరంజీవి క‌ల‌వ‌డంపై పెద్ద దుమారం చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. ఓవైపు ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున చిరు సంప్ర‌దింపుల‌పై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూంటే మ‌రోవైపు వైసీపీ నుంచి నుంచి చిరుకు...

Vijay Devarakonda: త‌న మ‌ద్ద‌తు చిరుకే అంటోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ట్రెండింగ్‌లో చిరు ట్వీట్‌..
Follow us on

Vijay Devarakonda: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని చిరంజీవి క‌ల‌వ‌డంపై పెద్ద దుమారం చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. ఓవైపు ఇండ‌స్ట్రీ త‌ర‌ఫున చిరు సంప్ర‌దింపుల‌పై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తూంటే మ‌రోవైపు వైసీపీ నుంచి నుంచి చిరుకు రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసినట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈ విష‌యాన్ని చిరు దృష్టికి తీసుకెళ్ల‌గా..ఆ వార్త‌ల్లో ఏ మాత్రం నిజం లేద‌ని ఖండించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై ట్విట్ట‌ర్ వేదిక‌గా చిరు సుధీర్ఘంగా ఓ పోస్టు చేశారు.

ఈ విష‌య‌మై చిరు ట్వీట్ చేస్తూ.. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా, ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారం. రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి, చట్టసభలకు రావటం జరగదు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో చిరు చేసిన #GiveNewsNotViews అనే ట్యాగ్ ఇప్ప‌డు వైర‌ల్ అవుతోంది నెట్టింట వైర‌ల్ అవుతోంది.

నెటిజ‌న్లు చిరు ట్వీట్‌ను పెద్ద ఎత్తున రీట్వీట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చిరంజీవికి మ‌ద్ధుతుగా ట్వీట్ చేశారు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. చిరు పోస్ట్ చేసిన #GiveNewsNotViews ట్యాగ్‌ను ట్వీట్ చేస్తూ.. నా పూర్తి మ‌ద్ద‌తు తెలుపుతున్నాను అంటూ రాసుకొచ్చారు. మ‌రి ఈ వ్య‌వ‌హ‌రం ఇంకా ఎలాంటి మ‌లుపులు తిరుగుతాయో చూడాలి.

Also Read: Bunny Vox: ట్రెడిషినల్ లుక్ లో అదరగొడుతున్న బన్నీవాక్స్

NVS Recruitment 2022: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నవోదయ విద్యాలయంలో 1900 పైగా నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

Covid-19: ఆ దేశంలో కరోనా సోకితే జైలే.. పాజిటివ్ అంటేనే బెంబేలెత్తుతున్న ప్రజలు..