జాకీచాన్‌, టోనీ జా నన్ను ప్రశంసించారు

| Edited By:

Aug 13, 2020 | 3:03 PM

హాలీవుడ్‌ యాక్షన్ హీరోలు జాకీ చాన్‌, టోనీ జా తనను ప్రశంసించారని బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ అన్నారు.

జాకీచాన్‌, టోనీ జా నన్ను ప్రశంసించారు
Follow us on

Vidyut Jammwal about Jackie Chan call: హాలీవుడ్‌ యాక్షన్ హీరోలు జాకీ చాన్‌, టోనీ జా తనను ప్రశంసించారని బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమ్వాల్‌ అన్నారు. విలన్‌గా వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు, ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్‌కి దగ్గరయ్యారు. కాగా మార్షల్‌ ఆర్ట్స్‌లో మంచి పేరున్న ఈ నటుడి యాక్షన్‌కి జాకీ చాన్‌, టోనీ జా ఫోన్ చేసి ప్రశంసలు కురిపించారట.

ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విద్యుత్‌.. ”నా యాక్షన్‌ని చూసి మూడు సంవత్సరాల క్రితమే జాకీ చాన్‌, టోనీ జా నన్ను ఫోన్ చేసి అభినందించారు. అప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. కానీ ఈ విషయాన్ని నేను మీడియా ముందుకు వచ్చి ఏనాడు చెప్పలేదు. అయినా ఎవరో వచ్చి ఏదో చూస్తారని నువ్వు ఎదురుచూడకూడదు. నీ పని నువ్వు చేసుకుంటూ పోవాలి” అని అన్నారు. కాగా విద్యుత్‌ జమ్వాల్‌ నటించిన ‘ఖుదా హఫీజ్’ ఈ నెల 14న హాట్‌స్టార్‌లో విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు విద్యుత్‌.

Read More:

ఆ వివరాలన్నీ డిస్‌ప్లేలో పెట్టండి: ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం ఆదేశం

ఈ ఆగష్టు 15కు ఖైదీల విడుదల లేనట్లేనా!