Varun Tej: విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. సినిమా సినిమాకు మధ్య కథల విషయంలో భారీగా వ్యత్యాసం ఉండేలా చూసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న వరుణ్.. మరో చిత్రాన్ని ప్రకటించాడు. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా తెరకెక్కుతోన్న న్యూ మూవీకి సంబంధించి చిత్ర యూనిట్ సోమవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది.
అంతకు ముందు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ఆసక్తిని పెంచిన విషయం తెలిసిందే. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ప్రకటించడంతో అందరిలోనూ ఈ సినిమా కథపై ఇంట్రెస్టింగ్ పెరిగింది. ఇక తాజాగా సినిమా ఫస్ట్‌లుక్‌ను అధికారికంగా విడుదల చేశారు. ఇందులో వరుణ్ తేజ్ ఒక ఏయిర్ వింగ్ కమాండర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ ఫొటోతో పాటు.. ‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అవధులు లేని ధైర్య సాహసాలు, శౌర్యాన్ని సంబరాలు జరుపుకుంటున్నాయి. ఆకాశంలో జరిగే యుద్ధాన్ని వెండితెరపై చూసేందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ రాసుకొచ్చారు.
Bravery that knows no bounds, celebrating the valour of
Indian Air Force.
Get ready to witness the battle in the skies on the big screen,
taking off soon! ??#VT13 pic.twitter.com/QvSJL62DRf— Varun Tej Konidela (@IAmVarunTej) September 19, 2022
దీంతో ఈ సినిమా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ వర్థమాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుందోన్న వార్తలకు బలం చేకూర్చింది. సోని పిక్చర్స్ ఇంటర్‌నేషనల్ ప్రొడక్షన్స్, రెన్నాయ్‌సెన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..