
‘వచ్చిండే.. మెల్లామెల్లగ వచ్చిండే..’ ఏ వేడుకలో చూసినా ఇదే పాటకు చిందులేస్తోంది యువత. ‘ఫిదా’ చిత్రం విడుదలై రెండేళ్లు అవుతున్నా ఈ పాటకున్న క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. ఇప్పటివరకు ఈ వీడియోను యూట్యూబ్‌లో దాదాపు 20 కోట్ల మందికి పైగా వీక్షించారు. సాయి పల్లవి అందం, వరుణ్ తేజ్ కొంటెతనంతో ఈ పాటలో చేసే అల్లరికి ప్రేక్షకులు ‘ఫిదా’ అయ్యారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా వరుణ్, సాయి పల్లవి కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోయింది. మధుప్రియ, రాంకీ ఈ పాటను ఆలపించారు. ముఖ్యంగా మధుప్రియ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయింది.