Uppena Movie : ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసారా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?

|

Jan 24, 2021 | 5:50 AM

మెగా కాంపౌండ్ నుంచి మస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న..

Uppena Movie : ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసారా.. ప్రేక్షకుల ముందుకు వచ్చేది అప్పుడేనా..?
Follow us on

Uppena Movie : మెగా కాంపౌండ్ నుంచి మస్తున్న మరో హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఈ యంగ్ హీరో ‘ఉప్పెన’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. తమిళ ప్రముఖ కథానాయకుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నారు.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఉప్పెన’ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 5న విడుదల చేయాలనీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఎలాంటి పోటీ లేని సమయంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ  చూస్తున్నారు. అందమైన ఈ ప్రేమ కథ ప్రేక్షకులను తప్పకుండ మెప్పిస్తుందని మంచి హిట్ అందుకుంటుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 18 – 20 కోట్లు చేయాల్సిన అవసరం ఉందని.. అలా చేస్తేనే సినిమాకి పెట్టిన పెట్టుబడి వర్క్ అవుట్ అవుతుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthi Suresh : దుబాయ్‌కి పయనమైన మహానటి.. మహేశ్‌తో ఆడిపాడేందుకేనా!.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్..