ఉపాసన.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్

ఉపాసన కామినేని.. మొన్నటిదాకా రామ్ చరణ్ భార్య.. చిరంజీవి కోడలు, అపోలో హాస్పిటల్‌కి వైస్ ఛైర్మన్‌గానే తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ.. ఫిట్‌నెస్ గురించి చిట్కాలు చెప్పినా, ఆరోగ్యకరమైన వంటలు నేర్పినా, సెలెబ్సిటీస్‌తో ఇంట్రెస్టింగ్ ఇంటర్వూలు చేసినా అది ఉపాసనకు మాత్రమే చెల్లుతోంది. అందుకేనేమో అటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లతో సహా యూట్యూబ్‌లోనూ ఉపాసనకి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది. సానియా, సల్మాన్, సమంత, సింధు.. ఇలా బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలతో […]

ఉపాసన.. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్

Edited By:

Updated on: Nov 23, 2019 | 7:54 PM

ఉపాసన కామినేని.. మొన్నటిదాకా రామ్ చరణ్ భార్య.. చిరంజీవి కోడలు, అపోలో హాస్పిటల్‌కి వైస్ ఛైర్మన్‌గానే తెలుసు. కానీ ఇప్పుడు ఆమె ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ.. ఫిట్‌నెస్ గురించి చిట్కాలు చెప్పినా, ఆరోగ్యకరమైన వంటలు నేర్పినా, సెలెబ్సిటీస్‌తో ఇంట్రెస్టింగ్ ఇంటర్వూలు చేసినా అది ఉపాసనకు మాత్రమే చెల్లుతోంది. అందుకేనేమో అటు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లతో సహా యూట్యూబ్‌లోనూ ఉపాసనకి ఫ్యాన్స్‌ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో పెరిగిపోతుంది.

సానియా, సల్మాన్, సమంత, సింధు.. ఇలా బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీలతో ఇంటర్వూలను ఎంచక్కా చేసేస్తుంది ఈ కొణిదెల వారి కోడలు. అంతేకాదు, తాను వేసుకున్న అవుట్ ఫిట్, జ్యూవెలరీ గురించి వివరిస్తూ కూడా అప్పుడప్పుపడూ కొన్ని పోస్ట్ లు పెడుతుంది. అంతే కాదు.. గెస్ట్ చెఫ్‌‌లతో వంటలు, ఇంటి పనులు చేసుకోవడంలో సలహాలు.. ఇలా ఆల్ ఇన్ వన్ ఆల్‌రౌండర్‌గా అన్ని విషయాల్లోనూ దూసుకుపోతుంది ఉపాసన. రీసెంట్‌గా ఉపాసనకి యూట్యూబ్ వారు అందించే సిల్వర్ బటన్ కూడా అందింది. ఈ సందర్భంగా తనని ఎల్లప్పుడూ సపోర్ట్ చేసే రామ్ చరణ్‌కు, తన ఫాలోవర్స్‌కు, అలాగే తన సోషల్ మీడియా టీంకు ప్రత్యేకంగా  థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్ పెట్టింది. రానున్న కాలంలో మరిన్ని విషయాలని పంచుకుంటానని, తాను ఇంకా ఎంతో ఎదగాల్సి ఉందని ఈ పోస్ట్‌లో చెప్పుకుంటూ వచ్చింది ఉపాసన.