‘హ్యాష్‌ట్యాగ్ డే’ సందర్భంగా 2019 సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో బాగా వైరల్‌గా మారిన టాప్ 5 హ్యాష్ ట్యాగ్స్‌ను ప్రముఖ మైక్రో బ్లాగ్ సంస్థ ట్విట్టర్ ప్రకటించింది. అందులో ‘విశ్వాసం’ మొదటి స్థానాన్ని సంపాదించగా.. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ నాలుగో స్థానంలో నిలిచింది. ఇక రెండు, మూడు, ఐదు స్థానాల్లో లోక్‌సభ ఎలక్షన్స్ 2019, సీడబ్ల్యూసీ 19(క్రికెట్ వరల్డ్ కప్19), న్యూ ప్రొఫైల్ పిక్ హ్యాష్ ట్యాగ్‌లు ఉన్నాయి.
కాగా అందులో రెండు సినిమాలు దక్షిణాది భాషలకు చెందినవే ఉండటం విశేషం. శివ దర్శకత్వంలో అజిత్ నటించిన ‘విశ్వాసం’ ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి కోలీవుడ్‌లో ఘన విజయం సాధించింది. ఇందులో అజిత్ సరసన నయనతార నటించింది అలాగే మహేష్ 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ‘మహర్షి’ సైతం టాలీవుడ్‌లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేష్ కీలక పాత్రలో కనిపించాడు.