AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking: క్యాన్సర్‌తో యువ నటి మృతి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చివరి పోస్ట్‌

ప్రముఖ టీవీ నటి, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌(2011) దివ్యా చౌక్సీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ నటి చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు.

Breaking: క్యాన్సర్‌తో యువ నటి మృతి.. కన్నీళ్లు పెట్టిస్తోన్న చివరి పోస్ట్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 9:41 PM

Share

ప్రముఖ టీవీ నటి, మిస్ యూనివర్స్ కంటెస్టెంట్‌(2011) దివ్యా చౌక్సీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈ నటి చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. దివ్యా మరణ వార్తను ఆమె కజిన్ సౌమ్య అమిష్ వర్మ సోషల్ మీడియాలో వెల్లడించారు.

కాగా చనిపోయే గంటల ముందు దివ్య తన ఇన్‌స్టాలో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. అందులో.. నేను చెప్పాలనుకున్న విషయాన్ని తెలపడానికి మాటలు రావడం లేదు. గత కొన్ని నెలలుగా నేను మెసేజ్‌లకు దూరంగా ఉంటున్నా. మీకు చెప్పేందుకు ఇదే సరైన సమయం. నేను నా డెత్‌ బెడ్ మీద ఉన్నా. ఏమైనా జరగొచ్చు. అయినా నేను స్ట్రాంగ్‌గా ఉన్నా. మరో జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నా. నన్ను ఏం ప్రశ్నించకండి ప్లీజ్. మీరంటే నాకు ఎంత ఇష్టమే కేవలం దేవుడికి మాత్రమే తెలుసు అని కామెంట్ పెట్టారు. మరోవైపు ఆమె మరణంపై సహనటులు నిన్ను మిస్ అవుతాం. నీ ఆత్మకు శాంతి కలగాలి అని సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా హై అప్నా దిల్‌ తో ఆవారా అనే చిత్రంలో నటించిన దివ్యా.. బుల్లితెరపైన పలు సీరియల్స్‌లో మెరిసింది. కాగా ఇప్పటికే పలువురి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న బాలీవుడ్‌కి దివ్యా మరణం మరింత శోకాన్ని మిగిల్చింది.

పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు