Nandamuri Balakrishna: ఆ విషయంలో బాలయ్య, ట్రంప్ సేమ్ టు సేమ్..!

టాలీవుడ్ నటుడు, నటసార్వభౌమ నందమూరి బాలకృష్ణకు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు పోలిక పెడుతున్నారు నెటిజన్లు. ఓ విషయంలో వీరిద్దరు సేమ్ టు సేమ్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Nandamuri Balakrishna: ఆ విషయంలో బాలయ్య, ట్రంప్ సేమ్ టు సేమ్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 25, 2020 | 3:19 PM

టాలీవుడ్ నటుడు, నటసార్వభౌమ నందమూరి బాలకృష్ణకు, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు పోలిక పెడుతున్నారు నెటిజన్లు. ఓ విషయంలో వీరిద్దరు సేమ్ టు సేమ్ అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకు ఏ విషయంలో నెటిజన్లు వీరిద్దరని కంపేర్ చేస్తున్నారంటే.. సంతకం విషయంలో..!

రెండు రోజుల పర్యటనలో బాగంగా భారత్‌కు వచ్చిన డొనాల్డ్ ట్రంప్.. సోమవారం ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. తాజ్ అందాలను చూసిన ట్రంప్ అక్కడే ఉన్న సందర్శకుల పుస్తకంలో ఆ కట్టడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘‘తాజ్‌మహల్ నన్ను వావ్‌కు గురిచేసింది. భారతీయ సంస్క‌ృతిని చాటి చెప్పే అతి గొప్ప కట్టడాల్లో తాజ్ ఒకటి’’ అంటూ కామెంట్ పెట్టారు. ఇక కింద తన సంతకాన్ని చేశారు ట్రంప్. ఆ సంతకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దాన్ని బాలకృష్ణ‌ సంతకంతో నెటిజన్లు పోలుస్తున్నారు. ప్రపంచంలో వీరిద్దరి సంతకాన్ని ఎవ్వరూ కాపీగానీ, ఫోర్జరీ గానీ చేయలేరంటూ కామెంట్లు పెడుతున్నారు.”

Read This Story Also:ఇక రక్షణ రంగంలో భారత్-అమెరికా భాయీ.. భాయీ