
ఒకప్పుడు అటు తమిళ ఇటు తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది త్రిష. ఆ మధ్య చెన్నై బిజినెస్ మెన్ తో పెళ్లి దాకా వెళ్లి క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ కెరీర్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ’96’ సినిమాతో మంచి హిట్ అందుకుని ప్రస్తుతం కొన్ని డిఫరెంట్ చిత్రాలలో నటిస్తున్న త్రిష రీసెంట్ ఇంటర్వ్యూ తన పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.
తన మనసుకి దగ్గరగా అనిపించిన అతన్ని ప్రేమించి పెళ్లాడట అని అంటోంది త్రిష. అలాంటి వ్యక్తి కనిపిస్తే.. తనని నేను.. నేను తనని ఇద్దరం ఇష్టపడితే ఖచ్చితంగా పెళ్లాడేస్తా అని అంటోంది. అయితే ఎంత హడావుడిగా జరిగినా.. అందరిని మాత్రం పిలుస్తానని చెబుతోంది ఈ చెన్నై చిన్నది. ప్రసుత్తం లేడి సూపర్ స్టార్ నయన తార మాదిరి త్రిష కూడా లేడి ఓరియెంటెడ్ సినిమాలకు సైన్ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.