Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్తున్నారా.? ఈ విషయాలు గమనించండి..

| Edited By: Anil kumar poka

Feb 23, 2022 | 6:05 PM

Bheemla Nayak: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. వకీల్‌సాబ్‌ తర్వాత తమ అభిమాన హీరో నటిస్తోన్న 'భీమ్లా నాయక్‌' సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్‌ అభిమానులు. నిజానికి ఈ సినిమా..

Bheemla Nayak: భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వెళ్తున్నారా.? ఈ విషయాలు గమనించండి..
Bheemla Nayak
Follow us on

Bheemla Nayak: పవర్ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రోజు రానే వచ్చింది. వకీల్‌సాబ్‌ తర్వాత తమ అభిమాన హీరో నటిస్తోన్న ‘భీమ్లా నాయక్‌’ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు పవన్‌ అభిమానులు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కరోనా ప్రభావం తగ్గడంతో వెంటనే లైన్‌లోకి వచ్చేశాడు భీమ్లా నాయక్‌. ఫిబ్రవరి 25న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను (bheemla nayak pre release event) నేడు (బుధవారం) నిర్వహించనున్న విషయం తెలిసిందే. సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్స్‌లో అంగరంగ వైభవంగా ఈవెంట్‌ జరగనుంది. ఈ వేడుకకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నిజానికి ఈ వేడు సోమవారం జరగాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌ మంత్రి గౌతమ్‌ రెడ్డి అకాల మరణంతో వాయిదా పడిన విషయం విధితమే.

ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సందర్భంగా బుధవారం సాయంత్రం పలు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. అమీర్‌పేట మైత్రీవనం నుంచి యూసుఫ్‌ గూడ వైపు నుంచి వాహనాలకు అనుమతి నిరాకరించారు. వాహనాలను సవేరా ఫంక్షన్ హాల్, క్రిష్ణ కాంత్ పార్క్, కళ్యాణ్ నగర్, సత్యసాయి నిగమగమం, కృష్టానగర్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే జూబ్లిహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్లించనున్నారు.

ఇక భీమ్లా నాయక్‌ ఈవెంట్‌కు వచ్చే వారి కోసం సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక ఈవెంట్‌కు 21వ తేది కోసం ఇచ్చిన పాసులకు అనుమతి లేదని నిర్వాహకులు తెలిపారు. 23వ తేదీ పాసులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Also Read: Fenugreek Water: ఉదయాన్నే ఈ నీరు తాగితే డయాబెటిస్‌ అదుపులో.. ఇంకా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు..!

Spongy Rasgulla: రసగుల్లా స్పాంజిలా రావాలంటే ఇలా చేసి చూడండి.. అచ్చం స్వీట్ షాప్‌లోనివాటిలా..

Valimai Pre Release Event Live: వలిమై ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో