2019 రిపోర్ట్: టాలీవుడ్ టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌ ఇవే.!

|

Dec 25, 2019 | 5:42 PM

కంటెంట్, టాక్‌తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్స్ రాబడతాయి. కొన్నిసార్లు హీరోకు ఉన్న క్రేజ్‌ను బట్టి కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాగే 2019లో కొన్ని సినిమాలు హీరో ఫేమ్ వల్ల భారీ వసూళ్లు రాబట్టాయి.. మరికొన్ని చిత్రాలైతే కంటెంట్ వల్ల కలెక్షన్స్ అందుకున్నాయి. మరి అలా ప్రపంచవ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం… 1.సాహో.. ‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి […]

2019 రిపోర్ట్: టాలీవుడ్ టాప్ 10 హయ్యస్ట్ గ్రాసర్స్‌ ఇవే.!
Follow us on

కంటెంట్, టాక్‌తో సంబంధం లేకుండా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బంపర్ కలెక్షన్స్ రాబడతాయి. కొన్నిసార్లు హీరోకు ఉన్న క్రేజ్‌ను బట్టి కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాగే 2019లో కొన్ని సినిమాలు హీరో ఫేమ్ వల్ల భారీ వసూళ్లు రాబట్టాయి.. మరికొన్ని చిత్రాలైతే కంటెంట్ వల్ల కలెక్షన్స్ అందుకున్నాయి. మరి అలా ప్రపంచవ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్స్‌గా నిలిచిన మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

1.సాహో..

‘బాహుబలి’ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం ‘సాహో’. పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకుడు. కథ, కథనంలో లోపాలు ఉన్నప్పటికీ.. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉండటం.. అంతేకాకుండా ప్రభాస్ వరల్డ్‌వైడ్ క్రేజ్ సినిమాకు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. తెలుగులో ప్లాప్ అయినా.. హిందీలో ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టుకుంది. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 433.06 కోట్లు రాబట్టి 2019లోనే హయ్యస్ట్ గ్రాసర్స్‌‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది.

2.సైరా నరసింహా రెడ్డి…

తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’.  మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించగా.. అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని.. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 2019లో టాప్ 2 హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

3.మహర్షి…

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా రూపొందిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ‌గా నిలిచింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 175 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 2019 టాప్ 3 హయ్యస్ట్ గ్రాసర్‌గా పాపులర్ అయింది.

4.ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)…

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 137.6 కోట్లు రాబట్టింది.

5.వినయ విధేయ రామ:

‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమా తెరకెక్కించారు. మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్న ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. రిలీజైన తర్వాత అవి కాస్తా నీరు కారిపోయాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు 97.9 కోట్ల కలెక్షన్స్ రాబట్టి 2019 హయ్యస్ట్ గ్రాసర్స్‌‌లో ఒకటిగా నిలిచింది.

6.ఇస్మార్ట్ శంకర్…

రామ్, పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. పక్కా మాస్ ఎంటర్టైనర్‌గా పూరి మార్క్ డైలాగులతో ప్రేక్షకులకు ఈ సినిమా ఫుల్ మీల్స్ పెట్టింది. దీంతో ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా 83 కోట్లు రాబట్టడమే కాకుండా పూరిని మళ్ళీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది.

7.మజిలీ…

అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది. అంతేకాకుండా ‘నిన్ను కోరి’ లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమా కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాగా, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 70 కోట్లు రాబట్టింది.

8.జెర్సీ…

నేచురల్ స్టార్ నాని, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ ‘. లక్ష్యానికి వయసుతో సంబంధం లేదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఈ సినిమా అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని వరల్డ్ వైడ్‌గా 51.70 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

9.వెంకీ మామ:

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో దర్శకుడు కెఎస్ రవీంద్ర తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ’. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలి ఎంటర్టైనర్‌‌గా రూపొందిన ఈ చిత్రానికి వెంకీ మెయిన్ హైలైట్‌గా నిలిచాడు. రాశి ఖన్నా, పాయల్ రాజ్‌‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో ఎమోషన్, కామెడీ, సెంటిమెంట్ పుష్కలంగా ఉండటంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

10.గద్దలకొండ గణేష్…

తమిళ కల్ట్ మూవీ ‘జిగర్ తండా’ ఆధారంగా ‘గద్దలకొండ గణేష్’ తీశారు. పూర్తి నెగటివ్ క్యారెక్టర్‌లో నటించిన వరుణ్ తేజ్.. ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. అటు మాస్, ఇటు క్లాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఎలెమెంట్స్ అన్నింటిని దర్శకుడు హరీష్ శంకర్ సమపాళ్లను మేళవించడంతో ఈ చిత్రం పెద్ద హిట్ సాధించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 42. 5 కోట్లు రాబట్టింది.