Thalapathy Vijay: విజయ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

గోట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమానే దళపతి చివరి సినిమా అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండనున్న ఆయనకు ఇదే చివరి సినిమా అని కొందరు అంటున్నారు. ఈ సినిమా పై అభిమానులల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది.

Thalapathy Vijay: విజయ్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Vijay

Updated on: May 28, 2024 | 2:02 PM

తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గోట్. ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. విజయ్ నటించిన లాస్ట్ మూవీ లియో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సినిమా బాగున్నప్పటికీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో ఆ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు గోట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ఈ సినిమానే దళపతి చివరి సినిమా అయ్యే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండనున్న ఆయనకు ఇదే చివరి సినిమా అని కొందరు అంటున్నారు. ఈ సినిమా పై అభిమానులల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుండి కొత్త అప్‌డేట్ వచ్చింది.

‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనేది ‘GOAT’ ఈ సినిమా చాలా ఇంట్రస్టింగ్ గా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు విజయ్. అలాగే ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, జయరామ్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ కోసం టీమ్ విదేశాలకు వెళ్లింది. అలాగే ఈ సినిమాలో 50 శాతం డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా విజయ్ అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

‘గోట్’ చిత్రంలోని ‘విసిల్ పోడు’ పాటకు విజయ్ తన గాత్రాన్ని అందించాడు. నెల రోజుల క్రితం ఈ పాటను విడుదల చేశారు. మరో పాట కూడా పాడనున్నాడు విజయ్. అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ అవుతుందని తెలుస్తోంది. ‘మొదటిసారిగా దళపతి విజయ్ ఒకే సినిమాలో రెండు పాటలు పాడారు’ అని యువన్ శంకర్ రాజా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. దళపతి విజయ్ నటనతో పాటు పాటలు పాడటం అలవాటు చేసుకున్నాడు. ‘రాసిగన్’ (1994)లోని ‘బాంబే సిటీ..’, ‘విష్ణు’లోని ‘తొట్ట పెట్టా..’ (1995) వంటి పాటలు పాడారు విజయ్. ఇప్పుడు ఒకే సినిమాలో రెండు పాటలు పాడడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

దళపతి విజయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

దళపతి విజయ్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.