ఇండియాస్ బిగెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతుంది. తెలుగు లోనూ బిగ్ బాస్ షో విజయవంతంగా ఏడూ సీజన్స్ పూర్తి చేసుకుంది. అలాగే ఒక ఓటీటీ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ ప్రతి ఏడాది ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతూ మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది. బిగ్ బాస్ హౌస్ లోకి చాలా మంది ఎంట్రీ ఇస్తుంటారు. సినిమా వాళ్లు, సీరియల్ ఆర్టిస్ట్ లు, సోషల్ మీడియాలో పాపులర్ అయినా వారు ఇలా రకరకాల వాళ్లు హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే వారే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇక పోతే అలాగే హిందీలోనూ బిగ్ బా గేమ్ షో అదరగొడుతుంది. తాజాగా అక్కడ బిగ్ బాస్ ఓటీటీ మొదలైంది. రెండు ఓటీటీ సీజన్స్ తర్వాత ఇప్పుడు సీజన్ 3 మొదలైంది.
అయితే హిందీ బిగ్ బాస్ కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యాహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా హోస్ట్ మారారు. అనిల్ కపూర్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3కి హోస్ట్ గా చేస్తున్నారు. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ముఖాలు కూడా రివీల్ అయ్యాయి. ఈ జంటలలో ఒకరు ప్రముఖ యూట్యూబర్ అర్మాన్ మాలిక్ అతని ఇద్దరు భార్యలతో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అందరిని షాక్ కు గురి చేశాడు. యూట్యూబర్ అర్మాన్ మాలిక్‌కు ఒకరు కాదు ఇద్దరు భార్యలు ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ముగ్గురు కలిసే ఉంటారు. అతనికి తన భార్యలిద్దరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ముగ్గురూ కలిసి వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ జంట అనిల్ కపూర్ షో బిగ్ బాస్ OTT యొక్క కొత్త సీజన్‌లో పాల్గొన్నారు.
ఇలా ఇద్దరు భార్యలతో వెళ్లిన అర్మాన్ మాలిక్ కు అంతకు ముందే వివాహం అయ్యిందట. అంటే ఈ ఇద్దరు కాకుండా ముందు మరో భార్య ఉండేదట.. ఆమెతో విడాకులు అయిన తర్వాత ఈ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడట మనోడు. చాలా మంది అర్మాన్ మాలిక్ పై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అతన్ని విమర్శిస్తుంటే మరికొంతమంది అతనికి మద్దతు తెలుపుతున్నారు. తాజాగా సోషల్ మీడియా సంచలనం నటి ఉర్ఫీ జావేద్ అర్మాన్ మాలిక్‌కు మద్దతుతెలిపింది. ఉర్ఫీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అర్మాన్ ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో అర్మాన్ తన ఇద్దరు భార్యలు కృతికా మాలిక్ , పాయల్ మాలిక్‌లతో కలిసి ఉన్నాడు. “ఈ కుటుంబం నాకు కొంతకాలంగా తెలుసు అలాగే నేను కలుసుకున్న అత్యుత్తమ వ్యక్తులు వీరే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ ముగ్గురూ సంతోషంగా ఉంటే వారిని జడ్జ్ చేయడానికి మనం ఎవరు. ఇలాంటివి చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. ఇది ఇప్పటికీ కొన్ని మతాలలో ప్రాచుర్యం పొందింది. ఆ ముగ్గురికీ సమస్య లేకుంటే మనం ఏమీ అనడానికి ఉండదు.” అని ఉర్ఫీ జావేద్ రాసుకొచ్చింది.