యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి (Harsh Kanumilli) ప్రధాన పాత్రలో డైరెక్టర్ జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కిస్తున్న లేటేస్ట్ చిత్రం సెహరి(Sehari). ఇందులో హర్ష్ సరనస సిమ్రాన్ చౌదరి హీరోయిన్గా నటిస్తుంది. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. యంగ్ హీరో హర్ష్ కనుమిల్లి కథా రచయితగా వ్యవహరించిన ఈ మూవీ ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో సెహరి ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో సెహరి ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు తమిళ్ స్టార్ హీరో విశాల్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. సెహరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను టీవీ 9 తెలుగులో ప్రత్యేక్ష ప్రసారంలో చూడవచ్చు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారీ నేపథ్య సంగీతం అందించారు. . శిల్ప చౌదరి భాగస్వామ్యంతో వర్గో పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా అద్వయ జిష్ణు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Lata Mangeshkar: రాజ్‌కపూర్‌పై అలిగిన లతా మంగేష్కర్.. ఎందుకు అలా చేసిందంటే..
Shruti Haasan: పచ్చని ప్రకృతి నడుమ ఫోటోలకు ఫోజులిచ్చిన ‘శ్రుతి హాసన్’ సొగసులు చూడతరమా..(ఫొటోస్)