Karthikeya 2 : యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సుకుమార్ రైటింగ్స్‌లో 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే ఈ సినిమా తోపాటుగా కార్తికేయ సినిమాకు సీక్వెల్ కార్తికేయ2 కూడా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమాలో కూడా అనుపమ పరమేశ్వరనే హీరోయిన్‌గా నటిస్తుంది. ఇటీవలే అనుపమపరమేశ్వరన్‌ను హీరోయిన్ అంటూ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. విభిన్నమైన కథ కథనాలతో తెరకెక్కిన కార్తికేయ సినిమా నిఖిల్ కెరీర్‌లో ఓ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఇప్పుడు అలాంటి కథ తోనే కార్తికేయ 2 కూడా తెరకెక్కనుంది. ఈ సినిమాకు కూడా చందు మొండేటినే దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా షూటింగ్ చేస్తూ వచ్చారు చిత్రయూనిట్.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసిందట. ఈ నెల చివరిలో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్రయూనిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. షూటింగ్ నిమిత్తం రెండు వారాలపాటు చిత్ర బృందం విదేశాలకు వెళ్లనున్నారట. ఇక ఇప్పటికే విడుదల చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక మొదటి పార్ట్ కంటే కార్తికేయ 2 మరింత ఇంట్రెస్టింగ్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉండనుందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కార్తికేయలో హీరోయిన్‌గా నటించిన స్వాతి.. ఇప్పుడు కార్తికేయ 2లో కీలక పాత్రలో కనిపిస్తుందని అంటున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :