Urvasivo Rakshasivo Teaser: రొమాంటిక్ మూవీతో రెడీ అయిన అల్లు శిరీష్.. “ఉర్వశివో రాక్షసీవో” అంటూ..

|

Sep 30, 2022 | 10:09 AM

అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అలరిస్తున్నాడు అల్లు శిరీష్.

Urvasivo Rakshasivo Teaser: రొమాంటిక్ మూవీతో రెడీ అయిన అల్లు శిరీష్.. ఉర్వశివో రాక్షసీవో అంటూ..
Urvashi Rakshasi
Follow us on

అల్లు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల అలరిస్తున్నాడు అల్లు శిరీష్. గౌరవం అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు అల్లు శిరీష్. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. మొన్నటివరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆకట్టుకున్న శిరీష్.. ఈ మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నాడు. చివరిగా ఏబీసీడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మరో సరికొత్త ప్రేమకథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు శిరీష్. ఈ సినిమాకు ఉర్వశివో రాక్షసీవో అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేశారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో అను ఇమాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోంది. చాలా రోజుల క్రితం శిరీష్ ,అను ల రొమాంటిక్ పోస్టర్స్ ను రిలీజ్ చేసి సినిమా పై ఆసక్తిని పెంచారు చిత్రయూనిట్. గతంలో ఈ సినిమాకు `ప్రేమ కాదంట` అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు టైటిల్ మార్చి  ఉర్వశివో రాక్షసీవో అని ఖరారు చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.

“కొన్ని విషయాలు మనం ఎంత ట్రై చేసినా జరగవు.. ఒకోసారి అనుకోకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడే అది మళ్లీ మళ్లీ జరిగితే బాగుండు అనిపిస్తుంది` అంటూ అల్లు శిరీష్ వాయిస్ తో టీజర్ మొదలైంది. ట్రైలర్ అంతా రొమాంటిక్ సన్నివేశాలతో నింపేశారు. ఇంట్లో బుద్దిమాన్ ..వీధిలో శక్తిమాన్.. అంటూ పోసాని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. నేను లవ్ చేస్తున్నానని శిరీష్ అంటే .. నేను జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేశానని అను అనడంతో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇక రొమాంటిక్ డ్రామా తో అల్లు శిరీష్ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.