Naveen Polishetty: చిచ్చోరే, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి.. ఇటీవల జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. నాగ్ అశ్విన్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ కేవి అనుదూప్.. తెరకెక్కించిన ఈ సినిమా.. నవీన్ పోలిశెట్టి, ప్రియాదర్శి, రాహుల్ రామకృష్ణ కెరీర్లో బ్లాక్ బస్టర్ హీట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ ప్రధాన పాత్రలో నటించిన నవీన్ పోలిశెట్టికి ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ యంగ్ టాలెంటెడ్ హీరో కోసం టాప్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా.. యంగ్ డైరెక్టర్స కూడా స్టోరీలను సిద్ధం చేసుకుంటున్నారట. ఇప్పటికే నవీన్ పోలిశెట్టికి.. వెంకి కుడుముల ఓ కథను చెప్పాడట. అలాగే రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ కూడా ఈ టాలెంటెడ్ హీరోకు ఓ స్టోరీ వినిపించినట్లుగా టాక్. త్వరలోనే ఇవి రెండు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే నవీన్ కు రూ. 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్. అలాగే.. తర్వలోనే ఓ మంచి స్టోరీని సెలక్ట్ చేసుకొని అందుకు సంబంధించిన విషయాలను షేర్ చేయాలని చూస్తున్నాడట నవీన్.