Hit 3 Movie: టాలీవుడ్‌లో మరో విషాదం.. హీరో నాని ‘హిట్‌ 3’ మువీ షూటింగ్‌లో అపశృతి! ఏం జరిగిందంటే

|

Dec 31, 2024 | 11:32 AM

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న తాజా మువీ 'హిట్ 3' షటింగ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉత్తర భారతంలో పలు చోట్ల షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న చిత్ర బృందం ఇటీవల జమ్మూ కశ్మీర్ కు వెళ్లింది. అక్కడ పలు సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా ఈ మువీ చిత్ర బృందంలో ఒకరైన యువ సినిమాటోగ్రాఫర్ కృష్ణ తీవ్ర ఆస్వస్థతకు గురయ్యారు..

Hit 3 Movie: టాలీవుడ్‌లో మరో విషాదం.. హీరో నాని హిట్‌ 3 మువీ షూటింగ్‌లో అపశృతి! ఏం జరిగిందంటే
Hit 3 Movie Shooting In Srinagar
Follow us on

హీరో నాని కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్ 3’ తెలుగు సిరీస్‌లో షూటింగ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. విష్వక్‌ సేన్‌తో ‘హిట్‌’, అడివి శేష్‌తో ‘హిట్‌ 2’ చిత్రాల్ని తెరకెక్కించిన శైలేశ్‌ మూడో భాగాన్ని నానితో రూపొందిస్తున్నారు. అయితే ఈ మువీ బృందంలో యువ సినిమాటోగ్రాఫర్ కేఆర్ కృష్ణ(30) ఉన్నారు. జమ్మూకశ్మీర్‌లో సినిమా షూటింగ్‌ నిమిత్తం వెళ్లిన ఆమె.. అక్కడ శ్రీనగర్‌లో షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటీన ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో ఆమె మృతి చెందినట్లు తెలుస్తుంది. సినీ సినిమాటోగ్రాఫర్‌, ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ (డబ్ల్యూసీసీ) సభ్యురాలైన కేఆర్‌ కృష్ణ ఎర్నాకులంకు చెందిన కృష్ణ కోదంబ్రం రాజన్, గిరిజ దంపతుల కుమార్తె. తండ్రి కృష్ణ కోదంబ్రం రాజన్‌కు పెరుంబవూరు, కురుపంపాడిలో గిన్నిస్ స్టూడియోలు ఉన్నాయి.

‘హిట్ 3’ తెలుగు సిరీస్‌కు మలయాళ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ సాను వర్గీస్ ఈ మువీకి డిఓపి (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) గా పనిచేస్తున్నారు. కృష్ణ అతని అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. ఈ మువీ షూటింగ్‌లో భాగంగా రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో షెడ్యూల్స్ తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో షూటింగ్‌ కోసమని చిత్రబృందం అక్కడికి వెళ్లింది. అయితే ఆమె అక్కడ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం కారణంగా కృష్ణ ఈ నెల 23న కశ్మీర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. తర్వాత పరిస్థితి తీవ్రమవడంతో శ్రీనగర్‌ గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కాస్త కోలుకున్న కృష్ణ తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. జ్వరం, ఇన్ఫెక్షన్ కారణంగా కృష్ణ ఆసుపత్రిలో చేరారని తెలియడంతో అతని సోదరుడు ఉన్ని శ్రీనగర్ చేరుకున్నారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరిన కృష్ణను వార్డుకు తరలించే క్రమంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కృష్ణ అనేక మలయాళ చిత్రాలలో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 20 ఏళ్ల వయసులో సినిమాటోగ్రఫీ చదివిన కృష్ణ.. వినీత్ శ్రీనివాసన్ నటించిన ‘మనోహరం’ చిత్రానికి తొలిసారి అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆమె ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు. కృష్ణ చివరిగా మలయాళంలో నటించిన బాసిల్ జోసెఫ్ మువీ ‘పొన్మణి’లో పనిచేశారు. మంగళవారం సాయంత్రం నెడుంబస్సేరి విమానాశ్రయం మీదుగా మృతదేహాన్ని కొచ్చికి తీసుకురానున్నారు.బుధవారం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణ కుటుంబం పెరుంబవూరు, కురుప్పంపాడి, కొత్తమంగళంలో గిన్నిస్ పేరుతో స్టూడియోలను నడుపుతోంది. ఆమెకు తల్లిదండ్రులు, ఉన్ని, కన్నన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి.