Tollywood : ఒకే రోజు విడుదలకానున్న 8 సినిమాలు.. ఈ ఏడాది చివరి చిత్రాలు ఇవే..

2025 మరికొద్ది రోజుల్లో మిగిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలకడానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉంది. కాగా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో ఎన్నోరకాల విషయాలు జరిగాయి. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి .

Tollywood : ఒకే రోజు విడుదలకానున్న 8 సినిమాలు.. ఈ ఏడాది చివరి చిత్రాలు ఇవే..
Tollywood Movies

Updated on: Dec 22, 2025 | 3:04 PM

మరి కొద్దీ రోజుల్లో 2025కు గుడ్ బై చెప్పనున్నాం.. ఈ ఏడాది చాలా చిత్ర విచిత్రాలు జరిగాయి. చిన్న సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అదేవిధంగా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు మాత్రం దారుణంగా నిరాశపరిచాయి. అలాగే కొన్ని సినిమాలు కాంట్రవర్సీల్లోనూ ఇరుక్కున్నాయి. ఇదిలా ఉంటే ఈ ఏడాది చివరిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే అఖండ 2 విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిసెంబర్ 12న విడుదలైంది. ఇక ఇప్పుడు ఈ ఏడాది చివరిలో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో చూద్దాం.!

అందంలో స్టార్ హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోదు.. దోచెయ్ సినిమాలో చైతూ చెల్లెలు గుర్తుందా.?

ఈ ఏడాది చివరి సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఛాంపియన్‌ సినిమా గురించే.. శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి డిసెంబర్ 25న ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో రోషన్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాతో పాటు ఆది సాయి కుమార్ నటిస్తున్న శంబాలా సినిమా కూడా రానుంది.

మేము పనికిరామా.. డ్రైవర్, పనిమనిషిల పాత్రలే ఇస్తారా.. సీరియల్ నటుడి ఆవేదన

హారర్‌.. సస్పెన్స్‌ కాన్సెప్ట్ తో శంబాల సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కూడా డిసెంబరు 25న ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా పై ఆది సాయి కుమార్ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈషా అనే సినిమా కూడా రానుంది. ఈ సినిమా కూడా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలకానుంది. వీటితో పాటు దండోరా, పతంగ్, బ్యాడ్ గర్ల్స్, మోహన్ లాల్ నటిస్తున్న వృషభ, కిచ్చా సుదీప్‌ మార్క్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఈసినిమాలతో ఈ ఏడాది పూర్తి కానుంది. మరి ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు విజయాన్ని సాదిస్తాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

చిన్న కథ కాదురా ఇది..! ఈ క్రేజీ బ్యూటీని గుర్తుపట్టారా.? అందంలో అప్సరస ఆమె

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.