Roja Selvamani: ఏపీ ప్రభుత్వనికి టాలీవుడ్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే.. టికెట్ రేట్లు తగ్గించడం పై సినీపెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ల రేటు తగ్గిస్తే సినిమాలకు లాభాలు రావు అని సినీ పెద్దలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం పై హీరో నాని, సిద్దార్థ్ కామెంట్ చేయడంతో మంత్రులు రంగంలోకి దిగారు. టాలీవుడ్ సినిమాల పై కౌంటర్లు వేస్తున్నారు. రెమ్యునరేషన్‌తో సహా సినిమా మేకింగ్‌కి అయ్యే ఖర్చు తగ్గించుకోండి. ఆ డిస్కౌంట్ అప్లై చేసి వీక్షకులకు తక్కువ రేట్‌లో సినిమా చూపించండి అని ఏపీ మంత్రులు కొందరు హీరోలకు చురకలు అంటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎమ్మెల్యే రోజా ఈ వ్యవహారం పై స్పందించారు.
సీఎం జగన్ ఏం చేసినా పేదలకు మంచి జరిగేలానే చూస్తారు అని నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పెద్ద సినిమాల గురించి ఆలోచిస్తున్నారే కానీ చిన్న సినిమాల గురించి ఆలోచించడం లేదని ఆమె అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుంది రోజా తెలిపారు. నాని సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్నప్పుడు ఆయన సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చు. ఇలాంటి వాఖ్యలు రెచ్చగొట్టడమే అవుతుందని రోజా మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుంది. కొద్దిమంది రాజకీయ ఉనికిని చాటుకునేందుకు, పార్టీలు పెట్టిన వారి వల్లే ఇలాంటి వివాదాలు వస్తున్నాయని ఆమె అన్నారు. అలాగే కొద్దిమంది నోటి దురద వల్లే మా ఎన్నికలు జనరల్ ఎలక్షన్ ను తలపించాయని. పొలిటికల్ పార్టీ పెట్టి సినిమాలు తీస్తున్న వ్యక్తి వల్లనే ఇదంతా జరుగుతుందని.. సినిమా ఇండస్ట్రీలో ఎవరికి తోచినట్టు వారు మాట్లాడటం వల్లే ఇదంతా జరుగుతోందని రోజా ఫైర్ అయ్యారు. మంచి ఉదేశ్యంతో తో చర్చలకు వస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని రోజా అన్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :