
2026లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ చిత్రాల్లో రాకింగ్ స్టార్ హీరోగా నటిస్తోన్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్’ ఒకటి. ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ మూవీ నుంచి నాడియా పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ కియారా అద్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయటంతో ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహం పెరిగింది. ఎమోషనల్, హై వోల్టేజ్ కమర్షియల్ మూవీస్ ఇలా… వైవిధ్యమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది కియారా అద్వానీ . ఇప్పుడు గీతూ మోహన్ దాస్ రూపొందిస్తోన్న శక్తివంతమైన ప్రపంచంలోకి నాడియా పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఈ పాత్ర ఆమె ఫిల్మోగ్రఫీ రేంజ్‌లో మరింత పెంచేలా సరికొత్తగా ఉంది. నాడియాగా కియారా అద్వానీ పస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే కలర్‌ఫుల్ బ్యాక్ డ్రాప్ కనిపిస్తోంది. కియారా అందరి కంటే ముందు నిలుచుకుని ఉంది. ఆమె పాత్రలో లోతైన భావోద్వేగాలు కనిపిస్తున్నాయి. ఈ హంగామా వెనుక బాధ, విషాదం ఏదో ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఆమె పాత్ర పెర్ఫామెన్స్‌కు ప్రాధాన్యతనిచ్చేలా కనిపిస్తోంది. లుక్ చూస్తుంటే ఇదేదో సాధారణమైన పాత్ర కాదని, ఆమె కెరీర్‌ను మలుపు తిప్పేలా ఉందనిపిస్తోంది.
నాడియా పాత్ర, కియారా అద్వానీ గురించి డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘‘కొన్ని పాత్రల్లో నటించినప్పుడు అవి సినిమాకే పరిమితం కావు. యాక్టర్‌కు సరికొత్త గుర్తింపును తీసుకొస్తాయి. నాడియా పాత్రలో కియారా చేసిన నటన డిఫరెంట్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో కనిపిస్తుంది. ఆమె పెర్ఫామెన్స్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ ప్రయాణంలో నాపై, నా టీమ్‌పై నమ్మకం పెట్టుకుని, మనస్ఫూర్తిగా ఆమె సపోర్ట్ చేసిన తీరుకి ధన్యావాదాలు’’ అన్నారు.
KGF: చాప్టర్ 2తో బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించిన యష్.. నాలుగేళ్ల తర్వాత ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2026లో విడుదలకానున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమాల్లో ఇదొకటి. ఈ సినిమాపై రోజు రోజుకీ అన్నీ సినీ ఇండస్ట్రీల్లో చర్చ జరుగుతోంది..అంచనాలు పెరుగుతున్నాయి. అంతే కాకుండా సినీ చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన KGF సినిమా ప్రస్థానం మొదలైన 7వ వార్షికోత్సవ రోజునే ఈ ప్రకటన రావడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ప్రత్యేకంగా మారింది.
యష్, గీతూ మోహన్‌దాస్ కలిసి కథను రాసి.. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఒకేసారి చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సహా మరికొన్ని భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంతర్జాతీయ స్థాయిలో భారీ అంచనాలున్నాయి. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. నిమాటోగ్రఫీ బాధ్యతలను నేషనల్ అవార్డు గ్రహీత రాజీవ్ రవి నిర్వహిస్తుండగా.. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఎడిటింగ్‌ను ఉజ్వల్ కులకర్ణి, ప్రొడక్షన్ డిజైన్‌ను టీపీ అబీద్ చూసుకుంటున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ జేజే పెర్రీ (జాన్ విక్ ఫేమ్)తో పాటు నేషనల్ అవార్డు గెలుచుకున్న అన్బరివ్ యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేశారు.
‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ నిర్మిస్తున్నారు. సినిమా 2026 మార్చి 19న ఈద్, ఉగాది, గుడి పడ్వా పండుగలు కలిసి వచ్చే లాంగ్ వీకెండ్ సమయంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
Introducing @advani_kiara as NADIA in – A Toxic Fairy Tale For Grown-Ups #TOXIC #TOXICTheMovie @thenameisyash #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar #KunalSharma #SandeepSharma #JJPerry @anbariv… pic.twitter.com/glUFoVh6C1
— KVN Productions (@KvnProductions) December 21, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.