AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yash : మాకోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. చనిపోయినవారి కుటుంబాలకు నేను అండగా ఉంటా: యష్

మృతి చెందిన వారు లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన హనుమంత మజ్జురప్ప హరిజన్, మురళీ నీలప్ప నిడివిమని, నవీన నీలప్ప గజిగా గుర్తించారు. 20ఏళ్ల యువకులు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. 25 అడుగుల ఎత్తుల్లో బ్యానర్స్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Yash : మాకోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. చనిపోయినవారి కుటుంబాలకు నేను అండగా ఉంటా: యష్
Yash
Rajeev Rayala
|

Updated on: Jan 09, 2024 | 8:58 AM

Share

రాకింగ్ స్టార్ యష్ బర్త్ డే వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. యష్‌ బర్త్ డే సందర్భంగా బ్యానర్స్ ఏర్పాటు చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ముగ్గరు ఫ్యాన్స్ మృతి చెందారు. మృతి చెందిన వారు లక్ష్మేశ్వర్ తాలూకా, సురంగి గ్రామానికి చెందిన హనుమంత మజ్జురప్ప హరిజన్, మురళీ నీలప్ప నిడివిమని, నవీన నీలప్ప గజిగా గుర్తించారు. 20ఏళ్ల యువకులు కరెంట్ షాక్ కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందారు. 25 అడుగుల ఎత్తుల్లో బ్యానర్స్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు మృతుల కుటుంబాలను పరామర్శించారు హీరో యష్. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన ఫ్యాన్స్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు యష్.

యశ్ మాట్లాడుతూ.. “బ్యానర్లు కట్టి అభిమానాన్ని చాటుకోవడం నాకు ఇష్టముండదు. ప్రతి సంవత్సరం నా పుట్టినరోజున ఇలాంటివి జరిగితే.. నాకు పుట్టినరోజు అంటే భయం వేస్తుంది. నిజం చెప్పాలంటే, నాపై నాకు అసహ్యం వేస్తుంది. నా పై ప్రేమ కురిపిస్తే చాలు. ఇదే నిజమైన పుట్టినరోజు’ అని యష్ అన్నారు.

‘కోవిడ్ వ్యాప్తి పెరుగుతున్న కారణంతో నా పుట్టినరోజు ఎవరికీ ఇబ్బంది కలగకూడదని ఈ సంవత్సరం అందరితో జరుపుకోకూడదని నిర్ణయించుకున్నాను. లేదంటే అభిమానులు రెచ్చిపోతారు. ఎవరికీ ఏదైనా అయితే నేను తట్టుకోలేను. ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబాలకు ఎవరు దిక్కు.? అని అన్నారు. దీని ద్వారా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. బైక్‌పై ర్యాలీలు, బ్యానర్ లు కట్టడాలు అలాగే ఛేజింగ్‌లన్నింటినీ వదిలివేయండి. మీరు నిజంగా ప్రేమను చూపించాలి, మంచి పని చేయాలి, మీరు జీవితంలో సంతోషంగా ఉండాలి అది చాలు. నన్ను ఎగతాళి చేసినా పట్టించుకోను, దూరంగా ఉంటాను. ప్రతి అభిమాని తన జీవితంలో ఎదుగుతుంటే.. తమ అభిమానాన్ని నాకు పై చూపించినట్లే అని యష్ అన్నారు. ఇప్పుడు నష్టపరిహారం ప్రకటించడం నాకు పెద్ద విషయం కాదు. నేను ఏదైనా మాట్లాడగలను. కానీ వారి కుటుంబానికి నిజంగా అవసరమైనది చేద్దాం. వారి కుటుంబానికి ఏం చేయాలో అది చేస్తాను. ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు. ఈ రోజు నేను రావడానికి కారణం చనిపోయిన వారి తల్లిదండ్రులను గౌరవించడమే. ఆ కుటుంబాలు ముగ్గురు బిడ్డలను కోల్పోయారు. మాపై అభిమానం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి. ప్రేమ, గౌరవం ఉంటే బాధ్యతాయుతంగా వ్యవహరించండి’ అని యశ్‌ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.