Toxic Movie: టాక్సిక్ నుంచి మరో క్రేజీ అప్డేట్.. రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయిన యశ్, కియారా!

యశ్ నటించిన టాక్సిక్ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రమోషన్లు ముమ్మురం చేశారు మేకర్స్. సినిమాకు సంబంధించి వరుసగా అప్టేట్స్ ఇస్తున్నారు. తాజాగా యశ్ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్

Toxic Movie: టాక్సిక్ నుంచి మరో క్రేజీ అప్డేట్.. రొమాంటిక్ సాంగ్‌లో రెచ్చిపోయిన యశ్, కియారా!
Toxic Movie

Updated on: Feb 28, 2026 | 8:55 AM

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ సినిమా నుండి వస్తోన్న ప్రతి అప్‌డేట్‌తో అభిమానులు థ్రిల్ అవుతున్నారు . ఇప్పటికే రెండు టీజర్‌లు విడుదలయ్యాయి. ఇప్పుడు మొదటి పాట విడుదలకు సమయం ఆసన్నమైంది. దీని గురించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన వచచింది. ‘టాక్సిక్’ సినిమా మొదటి పాట మార్చి 2న విడుదల కానుంది. ఈ పాట యష్, కియారా అద్వానీల మధ్య సాగనుందని తెలుస్తోంద. ఈ పాట చాలా హాట్, రొమాంటిక్‌గా ఉంటుందని లేటెస్ట్ గా రిలీజైన పోస్టర్ సూచిస్తుంది. ‘టాక్సిక్’ సినిమాలో యష్ పాత్ర నెగటివ్ షేడ్ లో ఉంటుందని టీజర్ ద్వారా తెలుస్తోంది. అందుకే పాటలు ఎలా ఉంటాయో అందరూ ఎదురుచూస్తున్నారు. యష్ తన అభిమానులకు ఒకదాని తర్వాత ఒకటి సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మొదటి పాటతో ఆ అంచనాలను మరింత పెంచేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ పాట పేరు ‘తబాహి’. ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిర్షా ఈ పాటకు సంగీతం సమకూర్చారు. పాట పోస్టర్‌లో యష్ కియారా అద్వానీని మోసుకెళ్తున్న సన్నివేశం ఉంది. ఈ పోస్టర్‌లో కియారా ముఖం కనిపించడం లేదు. కానీ ఆమె చాలా గ్లామరస్‌గా కనిపించడం ఖాయమని తెలుస్తోంది. ‘టాక్సిక్’ చిత్రంలోని అన్ని పాటలను అన్ని భాషల్లో ‘జీ మ్యూజిక్’ ద్వారా విడుదల చేయనున్నారు. విశాల్ మిశ్రా 4 పాటలకు సంగీతం సమకూర్చారు. అర్స్లాన్ నిజామి, ఫహీమ్ అబ్దుల్లాతో కలిసి తనిష్క్ బాగ్జీ ఒక పాటకు సంగీతం సమకూర్చారు. రవి బస్రురు ఒక పాటకు సంగీతం సమకూర్చారు అలాగే అతనే బీజీఎమ్ సమకూర్చారు. మొత్తం 5 మంది సంగీత దర్శకులు ఈ చిత్రానికి పనిచేశారు. టాక్సిక్ చిత్రాన్ని ‘కెవిఎన్ ప్రొడక్షన్స్’ నిర్మించింది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీలో  యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా మరియు రుక్మిణి వసంత్ హీరోయిన్లు గా నటించారు.ట

ఇవి కూడా చదవండి

టాక్సిక్ సినిమాలో యశ్, కియారా అద్వానీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us