Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ

తమ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందులో భాగంగానే సినిమా టిక్కెట్లపై క్రేజీ ఆఫర్లు ఇస్తుంటారు. అలా ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ను ప్రకటించింది చిత్ర బృందం.

Womens Day: వుమెన్స్ డే స్పెషల్.. మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ
Womens Day Special

Edited By: TV9 Telugu

Updated on: Mar 07, 2025 | 12:36 PM

సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా నారి. మహిళా ప్రాధాన్య కథతో తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. మార్చి 7న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ మరుసటి రోజే ప్రపంచ మహిళా దినోత్సవం ఉండడం, ఈ సినిమా కూడా లేడీ ఓరియంటెడ్ మూవీ కావడంతో చిత్ర బృందం ఒక బంపరాఫర్ ప్రకటించింది. అదేంటంటే.. మార్చి 7 & 8 తేదీల్లో నారి సినిమా చూసే కపుల్స్ కోసం టికెట్స్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటించింది మూవీ యూనిట్. అంటే 7వ తేదీన, 8వ తేదీన అన్ని షోస్ కు ఈ క్రేజీ ఆఫర్ వర్తించనుంది. టికెట్స్ సమీపంలోని థియేటర్లలో లేదా బుక్ మై షో యాప్‌ ద్వారా కూడా ఈ ఆఫర్ తో బుక్ చేసుకోవచ్చని చిత్ర బృందం ప్రకటించింది.

సూర్య వంటిపల్లి తెరకెక్కించిన ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ సినిమాలో ఆమనితో పాటు వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. శశి వంటిపల్లి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే ఛార్ట్ బస్టర్ గా నిలిచాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రమణ గోగుల పాడిన ‘గుండెలోన ఏదో గట్టి సప్పుడైనదే’ పాట యూత్ ఆడియెన్స్‌కు బాగా నచ్చింది. అలాగే ప్రముఖ సింగర్ సునీత పాడిన ‘హవాయి.. హవాయి..’ పాట సైతం ఆకట్టుకుంటోంది. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించారు.

మహిళా దినోత్సవం కానుకగా..

నారి సినిమాలో ప్రగతి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి