టాలీవుడ్ లో యంగ్ హీరోల్లో ముందు వరసలో ఉండే హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క సినిమాతోనే విజయ్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బిగెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ స్టైల్, యాటిట్యూడ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయారు. రీసెంట్ గా ఖుషి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఖుషి సినిమాలో హీరోయిన్ గా సమంత నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పటికి కూడా కొన్ని థియేటర్స్ లో రన్ అవుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఓ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు విజయ్. మళ్ళిరావా, జెర్సీలాంటి మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
Happiest birthday to you Vijay. You deserve all the success and love in the world. Wishing Kushi to be a blockbuster and we continue the run 🙂 @TheDeverakonda #VD12 pic.twitter.com/UQqS2Sgqmw
— gowtam tinnanuri (@gowtam19) May 9, 2023
ఇక ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో విజయ్ పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కారెక్టర్ ఆర్టిస్ట్ మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో విజయ్ పాత్ర గురించి లీక్ ఇచ్చారు. ఈ సినిమాలో తాను ఎస్ ఐ గా నటిస్తుండగా. విజయ్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడని తెలిపారు. దాంతో విజయ్ క్యారెక్టర్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతోంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించనుంది.
#VD12
This one is special with @TheDeverakondaProduced by @vamsi84 & #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/IXM8uCoXxE
— gowtam tinnanuri (@gowtam19) January 13, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.