Trisha Krishnan: మరోసారి ఆ స్టార్ దర్శకుడితో సినిమా చేయనున్న త్రిష..

తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. త్రిష తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళ్ మీదే ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టింది.

Trisha Krishnan: మరోసారి ఆ స్టార్ దర్శకుడితో సినిమా చేయనున్న త్రిష..
Trisha

Updated on: Jul 17, 2023 | 9:54 AM

త్రిష.. ఈ చెన్నై చంద్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఒకానొక సమయంలో ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ హా రాణించింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇక ఇప్పటికి కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. త్రిష తెలుగులో సినిమాలు తగ్గించింది. తమిళ్ మీదే ఆమె ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఇక ఈ అమ్మడు ఇప్పుడు ఆచితూచి అడుగులేస్తోంది. మొనీమధ్య 96 సినిమా చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిష తమ నటనతో కట్టిపడేశారు. అలాగే ఈ సినిమాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అలాగే రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ అనే సినిమా చేసింది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కింది.

ఈ సినిమాలో త్రిష నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అందంతో కూడా ఆకట్టుకుంది. మణిరత్నం దర్శకత్వంలో త్రిష ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు మరోసారి మణిరత్నం దర్శకత్వంలో త్రిష సినిమా చేస్తుందని తెలుస్తోంది.

ప్రస్తుతం త్రిష వరుస సినిమాలు చేస్తోంది. అజిత్ సరసన ఓ సినిమా చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఓ సినిమా చేస్తుందని కూడా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేయనుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై అప్డేట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.