Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Awaara: సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రానుందట.. కానీ హీరో మాత్రం ఆయన కాదట..

కార్తి హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించిన సినిమా ఆవారా. రోడ్‌ డ్రామాగా తెరకెక్కింది ఈ మూవీ.

Awaara: సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రానుందట.. కానీ హీరో మాత్రం ఆయన కాదట..
Awaara
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 13, 2023 | 8:36 AM

ఆవారా సినిమా గుర్తుందా.? కార్తి, తమన్నా జోడీగా అప్పట్లో మాంఛి మ్యూజికల్‌ హిట్‌ అయింది. ఓ క్యాబ్‌ డ్రైవర్‌కి, అందులో ట్రావెల్‌ చేసిన అమ్మాయికి మధ్య ఏర్పడ్డ బాండింగ్‌తో రిలీజ్‌ అయింది.. గుర్తుకు రాకపోవడమేంటి.? అసలు.. ఆవారా మూవీని అంత తేలిగ్గా మర్చిపోతామా? అంటున్నారు. జనాలు మర్చిపోరు కాబట్టే, ఆవారా సినిమాకు సీక్వెల్‌ రెడీ చేయాలనుకుంటున్నారు డైరక్టర్‌ లింగుస్వామి. కార్తి హీరోగా, తమన్నా హీరోయిన్‌గా నటించిన సినిమా ఆవారా. రోడ్‌ డ్రామాగా తెరకెక్కింది ఈ మూవీ. లింగుస్వామి డైరక్షన్‌లో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ స్పెషల్‌ ఆడియన్స్ ఉంటారు. అప్పుడప్పుడూ ఈ పాటలను ఎక్కడో ఓ చోట వింటూనో, పాడుకుంటూనే ఉంటారు. ఆవారా మూవీకి సీక్వెల్‌ చేయాలనుకుంటున్నారట లింగుస్వామి. అయితే ఈ సీక్వెల్‌గా హీరోగా కార్తీ ఉండరట. కార్తీ ప్లేస్లో ఆర్యని ఫిక్స్ చేశారట లింగుస్వామి. రీసెంట్‌గా కథ విన్న ఆర్య కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

ఆవారా జర్నీ సౌత్‌ రీజన్‌ టు నార్త్ రీజన్‌కి సాగింది. ఇప్పుడు సీక్వెల్‌లో ఈ జర్నీని దుబాయ్‌లో ప్లాన్‌ చేస్తున్నారట లింగుస్వామి. లాస్ట్ ఇయర్‌ రామ్‌తో తెరకెక్కించిన వారియర్‌ ఫ్లాప్‌ కావడంతో, ఆవారా సీక్వెల్‌ మీద మరింత ఫోకస్డ్ గా ఉన్నారట ఈ కెప్టెన్‌.

ఆర్యతో జాన్వీ నటిస్తారన్నది టాక్‌. తమిళ్‌లో ఇదే జాన్వీకి తొలి సినిమా అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగులో కొరటాల డైరక్షన్‌లో తారక్‌ సరసన జాన్వీ ఎంట్రీ ఇస్తారనే మాట కూడా ఉంది. ఈ రెండు సినిమాలనూ జాన్వీ యాక్సెప్ట్ చేసినట్టయితే, 2023 ఆమె కెరీర్‌లో గుర్తుంచుకోదగ్గ ఇయర్‌ అవుతుంది.