SS Rajamouli ,Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యేది అప్పుడేనా..?

|

Mar 14, 2023 | 4:43 PM

త్వరలోనే మహేష్ బాబు మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్నారు.

SS Rajamouli ,Mahesh Babu: మహేష్ బాబుతో రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యేది అప్పుడేనా..?
Mahesh Babu - Rajamouli
Follow us on

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమోళి సినిమా కోసం మహేష్ అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంబరాల్లో ఉన్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు సాంగ్ ఆస్కార్ సొంతం చేసుకుంది. దాంతో చిత్రయూనిట్ అంతా సంబరాల్లో మునిగిపోయారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహేష్ బాబు మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మహేష్ సినిమా కథను రెడీ చేసే పనిలో ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ లో జాయిన్ అవ్వనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా షూటింగ్ ను ఆగస్టు నెలలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలోనే పూజాకార్యక్రమం కు కూడా ముహూర్తం ఖరారు చేయనున్నారని తెలుస్తోంది. మహేష్ తో జక్కన్న చేసే సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

రాజమౌళి సినిమా అంటే మినిమమ్ వేయి కోట్లు గ్యారెంటీ.. కాబట్టి మహేష్ సినిమాను దాదాపు 500 కోట్లతో నిర్మించనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికాపదుకునే ను ఎంపిక చేయాలనీ చుస్తున్నారట. ఆస్కార్ హడావిడి అయిపోయిన తర్వాత రాజమౌళి మహేష్ సినిమా పై పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.