AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పూరి సార్ పెద్ద ప్లానే వేశారు..! ఇన్ స్టాగ్రామ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్.?

ప్రస్తుతం పూరిజగన్నాథ్ కు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. చివరిగా పూరి డైరెక్షన్ లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం.. డైరెక్టర్ పూరి అయితే చాలు.

పూరి సార్ పెద్ద ప్లానే వేశారు..! ఇన్ స్టాగ్రామ్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన డైనమిక్ డైరెక్టర్.?
Puri Jagannadh
Rajeev Rayala
|

Updated on: May 13, 2025 | 12:48 PM

Share

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ వరుస ఫ్లాప్స్ తో రేస్ లో వెనుకబడ్డారు. ఆయన తరం దర్శకులు ఒకటికాకాపోయిన ఒక హిట్ అందుకుంటూ దూసుకుపోతుంటే పూరి మాత్రం వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్నారు. ఈ మధ్యకాలంలో పూరి ఏ సినిమా పట్టుకున్న అది ఫ్లాప్ అవుతుంది. సినిమాల విడుదలకు ముందుండే హైప్ వల్లో లేక పూరి సినిమాల కథల్లో బలం తగ్గడం వల్లో పూరికి పరాజయాల క్యూ పెరుగుతూ వస్తుంది. అప్పుడెప్పుడో రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరి చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. లైగర్ లాంటి కొత్త సినిమానే  కాదు.. డబుల్ ఇస్మార్ట్ లాంటి సీక్వెల్ కూడా ఈ డైనమిక్ డైరెక్టర్ కు హిట్ ఇవ్వలేకపోయింది. దాంతో ఇప్పుడు పూరి ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

అదే సమయంలో ఊహించని విధంగా తమిళ్ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేశారు. విజయ్ సేతుపతి హీరోగా పూరి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలానే హీరోయిన్ ఛార్మితో కలిసి పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతే కాదు ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్ సైడ్ టాక్ కూడా నడుస్తుంది. వీటితో పాటే..

ఇవి కూడా చదవండి

హీరోయిన్స్ గా బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే టబులాంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు. కాగా ఇప్పుడు మరో యంగ్ బ్యూటీకి పూరి సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. ఆమె పెద్ద హీరోయిన్ కాదు.. అలా అని స్టార్ కిడ్ కూడా కాదు. కానీ ఆమె సోషల్ మీడియా సెన్సేషన్.. ఇంటర్ నెట్ లో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది ఆమె.. ఆ చిన్నది ఎవరో కాదు నిహారిక. ఈ చిన్నది నెట్టింట తెగ సందడి చేస్తుంది. గతంలో రీల్స్ తోపాటు పలు బ్రాండ్స్ ప్రమోషన్స్ చేసి వైరల్ అయ్యింది. అలాగే సినిమాల ప్రమోషన్స్ లోనూ పాల్గొనేది ఈ చిన్నది. ఇప్పుడు ఈ భామకు సినిమాల్లో ఛాన్స్ ల వస్తున్నాయి. ఇటీవలే తమిళ్ లో ఓ సినిమా చేసింది. ఇప్పుడు పూరి ఈ భామకు ఛాన్స్ ఇచ్చాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

View this post on Instagram

A post shared by Niharika Nm (@niharika_nm)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
సెమీఫైనల్స్ రేసులో మిగిలింది ఆ నాలుగు జట్లే
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే చేదుగా మారుతుందా? దానికి కారణం ఇదే!
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
కేఫ్ రంగంలో వస్తున్న మార్పుల గురించి తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
శ్రేయస్ కంటే ముందే పరువు పోగొట్టుకున్న దిగ్గజ ప్లేయర్ ఎవరో తెలుసా
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
ఆధార్ యూజర్లకు కేంద్రం అలర్ట్.. నేటి నుంచి యాప్ సేవలు బంద్..
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు
వీరికి మహర్దశ పట్టబోతోంది.. జీవితంలో ఊహించని భారీ మార్పులు