
బిగ్ బాస్ సీజన్ 9 మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. ఇమ్మాన్యుయేల్, తనూజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు. కాగా బిగ్ బాస్ కప్పు కొట్టేది కళ్యాణ్ అని కొందరు.. లేదు తనూజ అని మరికొందరు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కాగా ఓటింగ్ లోనూ కళ్యాణ్, తనూజ పోటాపోటీగా దూసుకుపోతున్నారు. కళ్యాణ్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని బయట టాక్ వినిపిస్తుంది. కానీ బిగ్ బాస్ టీమ్ ఎవరిని డిసైడ్ చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఫైనలేకు గెస్ట్ గా ఎవరు రానున్నారని ఇప్పుడు టాక్ నడుస్తుంది. ప్రతి సీజన్ కు ఓ బిగ్ సెలబ్రెటీని పిలిచి విన్నర్ ను అనౌన్స్ చేయడం ఆనవాయితీగా వస్తుంది.
కాగా ఈసారి కూడా బిగ్ సెలబ్రెటీ బిగ్ బాస్ ఫైనలేకు గెస్ట్ గా రానున్నాడని తెలుస్తుంది. గతంలో బిగ్ బాస్ ఫినాలే కు మెగాస్టార్ చిరంజీవి ఎక్కువగా వచ్చారు. దాదాపు మూడు సార్లు మెగాస్టార్ ఫినాలే గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే ఓ సీజన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరై విన్నర్‌ను అనౌన్స్ చేశారు. కాగా ఈసారి ఎవ్వరూ ఊహించని గెస్ట్‌ను బిగ్ బాస్ స్టేజ్ పైకి తీసుకు రానున్నారని తెలుస్తుంది. ఆయన ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.
సీజన్ 9 ఫినాలేకు ప్రభాస్‌ను గెస్ట్‌గా పిలవాలని టీమ్ నిర్ణయించారట. ఇప్పటివరకు ప్రభాస్ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదు. జనవరి 9న రాజా సాబ్ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రభాస్‌ను బిగ్ బాస్ ఫినాలేకు గెస్ట్‌గా పిలిచారని తెలుస్తుంది. డార్లింగ్ కూడా బిగ్ బాస్ ఫినాలేకు రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. దాంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇదే వార్త నిజమైతే ప్రభాస్ చేతుల మీదుగా ఎవరు బిగ్ బాస్ సీజన్ 9 కప్పు అందుకుంటారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.