పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చాలా బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇక ఇప్పుడు ఆ సినిమాలను పట్టాలెక్కించనున్నారు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాల్లో హరిహరవీరమల్లు సినిమా ఒకటి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటుంది. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యింది. అయితే ఈ సినిమా షూటింగ్ వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.ఇక ఇప్పుడు . పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల వాయిదా పడింది.
కాగా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్పీడ్ పెంచనున్నారు. వీలైనంత త్వరగా హరిహరవీరమల్లు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పవన్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. హరిహరవీరమల్లు సినిమా నుంచి త్వరలో ఓ క్రేజీ అప్డేట్ రానుందని తెలుస్తోంది. ఇటీవలే పవన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇటీవలే మంగళగిరిలోనే ఈ సినిమా కోసం సెట్ ను ఏర్పాటు చేశారు. ఆ సెట్‌లో పవన్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు.
కాగా ఈ దసరాకు హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదటి పాట రాబోతుందని తెలుస్తోంది. హరిహరవీరమల్లు సినిమాకు కీరవాణి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్స్ ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే హరిహరవీరమల్లు సినిమా నుంచి మొదటి సాంగ్ ను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక హరిహరవీరమల్లు సినిమాలో చాలా మంది నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను క్రిష్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కు జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. అలాగే హరిహరవీరమల్లు సినిమాను రెండు భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి పార్ట్‌ను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.