ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్

|

Jan 14, 2025 | 4:33 PM

పవన్ కళ్యాణ్‌ తెరపై చివరిగా నటించిన చిత్రం ‘బ్రో’. ఆ తర్వాత పవన్ పూర్తిగా రాజకీయాల్లో బిజీగా మారారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం. ఆ తర్వాత జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం పవన్‌ డిప్యూటీ సీఎంతో పాటు పలు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు.

ఇదెక్కడి హైప్ రా మావ..! పవన్ కళ్యాణ్ ఓజీలో ఈ క్రేజీ బ్యూటీతో స్పెషల్ సాంగ్
Og
Follow us on

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాల్లో రాణిస్తూనే.. మరో వైపు పెండింగ్ లో ఉన్న సినిమాలు కూడా పూర్తి చేస్తున్నారు. ఇటీవలే హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి రాజకీయాల్లో దూసుకుపోతున్నారు పవన్. ఇక ఎన్నికల్లో గెలవక ముందు పవన్ పలు సినిమాలను లైనప్ చేసిన విషయం తెలిసిందే. పవన్ రాజకీయాలతో బిజీ కావడంతో ఆ సినిమాలను పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ లను పూర్తి చేసేపనిలో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఓజీ సినిమా ఒకటి. యంగ్ హీరో సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి : ఏంటీ..! మహేష్ బాబుతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు స్టార్ హీరోయినా.! అదికూడా తెలుగమ్మాయి

రన్ రాజా రన్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు సుజిత్. ఆతర్వాత ప్రభాస్ తో సాహో సినిమా చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాకు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి :Srihari: వాడు నా అయ్య..! శ్రీహరి నాన్న అని పిలిచే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా.?

ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందట. ఆ స్పెషల్ సాంగ్ ఓ హాట్ బ్యూటీ చేస్తుందని తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు క్రేజీ బ్యూటీ నేహా శెట్టి. డీజే టిల్లు సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా నేహా శెట్టి సినిమాలు చేసినా కూడా ఆ అమ్మడికి సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు సోషల్ సాంగ్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. నేహా శెట్టి నిజంగా పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి