Ravi Teja: మాస్ రాజా కోసం మహేష్ బాబు.. ఆ మూవీ కోసం రంగంలోకి సూపర్ స్టార్ .?

ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు గా రానున్నాడు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు.

Ravi Teja: మాస్ రాజా కోసం మహేష్ బాబు..  ఆ మూవీ కోసం రంగంలోకి సూపర్ స్టార్ .?
Raviteja

Updated on: May 22, 2023 | 7:08 AM

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ముట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు`. ఇప్పటివరకు రవితేజ నటించిన సినిమాలు విభిన్నంగా ఈ మూవీ ఉండనుంది. ఇటీవలే రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ రాజా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు గా రానున్నాడు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైం పోస్టర్లు  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా టీజర్ ను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఒకొక్కొక్క భాషలో ,ఒక్క స్టార్ హీరో ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. టాప్ స్టార్లు అందర్నీ టీజర్ కోసం బరిలోకి దించుతున్నారు. హిందీ టీజర్ కి ఏకంగా జాన్ అబ్రహం వాయిస్ ఓవర్ అందించారు. తమిళ్ లో ఇదే టీజర్ కి కార్తీ…కన్నడలో శివరాజ్ కుమార్..మలయాళంలో దుల్కార్ సల్మాన్ గాత్రాన్ని అందించారు. అయితే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ టీజర్ కు వాయిస్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మహేష్ పలు సినిమాలకు వాయిస్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లతో నిండిన ఈ సినిమాపై ఇప్పటికే క్రేజ్ ఏర్పడింది. 1970 నాటి కథ కావడంతో ఈ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ తన సంగీతంతో అలరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.