Boyapati Srinu: బోయపాటి ఆ స్టార్ హీరోతో సినిమా చేయనున్నాడా ..? ఇంతకూ ఆయన ఎవరంటే
బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన అన్ని సూపర్ హిట్ లు అందించారు. భద్ర తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజనకి నాయిక, వినయ విధేయ రామ, అఖండ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

టాలీవుడ్ లో టాప్ దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. 2005 లో వచ్చిన రవితేజ భద్ర సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు బోయపాటి. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ ఆ తర్వాత వరుస సూపర్ హిట్స్ తో స్టార్ డైరెక్టర్ గా మారిపోయారు. బోయపాటి తెరకెక్కించిన సినిమాలు దాదాపు విజయాలను అందుకున్నాయి. బోయపాటి చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఆయన అన్ని సూపర్ హిట్ లు అందించారు. భద్ర తర్వాత తులసి, సింహ, దమ్ము, లెజెండ్, సరైనోడు, జయజనకి నాయిక, వినయ విధేయ రామ, అఖండ లాంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే బోయపాటి తెరకెక్కించిన సినిమాల్లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయి. వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న బోయపాటి ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేనితో సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇందులో రామ కు జోడిగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాతర్వాత బాలకృష్ణతో మరో సినిమా చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే బోయపాటి ఇప్పుడు ఓ తమిళ్ హీరోతో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు విలక్షణ నటుడు సూర్య .
త్వరలోనే దీని పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెడీ చేసుకున్న కథను సూర్య కు వినిపించారట బోయపాటి. ప్రస్తుతం సూర్య కోలీవుడ్ లో శివ దర్శకత్వంలో కంగువ పేరుతో పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు . ఈ సినిమా పూర్తయిన తర్వాత బోయపాటితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. 




