Balakrishna-Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో నట సింహం.. దర్శకధీరుడి ప్లాన్ అదేనా..

|

Mar 19, 2022 | 10:11 AM

హీరోల కటౌట్‌ని పాన్ ఇండియా స్థాయికి పెంచే డైరెక్టర్‌గా పేరుంది జక్కన్నకు. ఇప్పుడు మాంచి పవర్‌ఫుల్ మల్టిస్టారర్స్‌ని కుకప్ చేసి కమర్షియల్‌ సక్సెస్ కొడతారన్న క్రెడిట్ కోసం ట్రై చేస్తున్నారు.

Balakrishna-Mahesh Babu: సూపర్ స్టార్ సినిమాలో నట సింహం.. దర్శకధీరుడి ప్లాన్ అదేనా..
Mahesh Balakrishna
Follow us on

S. S. Rajamouli : హీరోల కటౌట్‌ని పాన్ ఇండియా స్థాయికి పెంచే డైరెక్టర్‌గా పేరుంది జక్కన్నకు. ఇప్పుడు మాంచి పవర్‌ఫుల్ మల్టిస్టారర్స్‌ని కుకప్ చేసి కమర్షియల్‌ సక్సెస్ కొడతారన్న క్రెడిట్ కోసం ట్రై చేస్తున్నారు. ట్రిపులార్(RRR) తర్వాత ఆయన ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్‌ ఇస్తున్న సాలిడ్ హింట్ కూడా అదే. బాలయ్యతో సినిమా అంటే భయమని చెప్పి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా ఎలాగోలా ఎస్కేప్ అయ్యారు గానీ.. రాజమౌళి మనసులో మాత్రం ఎన్‌బీకే నిలబడే వున్నారు. బాలయ్య వ్యక్తిత్వాన్ని, ఆయన బోళాతనాన్ని అమితంగా ఇష్టపడే జక్కన్న. సేమ్‌టుసేమ్ అదే ఒరిజినల్ క్యారెక్టర్‌ని తెర మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారట.

దాదాపు పదిహేనేళ్లుగా పెండింగ్‌లో వున్న మహేష్‌-రాజమౌళి కాంబో సెట్స్ మీదికి రావాలంటే మరో క్యాలెండరైనా గడవాలి. ప్రస్తుతం సర్కారువారి పాటతో బిజీగా వున్న సూపర్‌స్టార్, అక్కడ గుమ్మడికాయ కొట్టగానే గురూజీ క్యాంప్‌లో చేరిపోతారు. ఆ తర్వాతే జక్కన్న-మహేష్‌ కాంబో అనేది రియాలిటీలోకొచ్చేది. ఆప్రాజెక్ట్‌లోనే బాలయ్యను ఇన్‌క్లూడ్ చేస్తారన్నది లేటెస్ట్ టాక్. ఒక సీనియర్ హీరోతో జతకట్టి బ్లాక్‌బస్టర్ కొట్టిన మహేష్‌తో అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తున్నారట దర్శకధీరుడు. కానీ… ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాదు.. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ స్టోరీతో ఈ మల్టిస్టారర్‌ రాబోతోంది. సినిమా ఆసాంతం నడిచేలా 40 నిమిషాల లెంత్ వుండే బలమైన క్యారెక్టర్‌ని బాలయ్య కోసం రాసిపెట్టారట.

అఖండ సక్సెస్‌ తర్వాత బాలయ్య కమర్షియల్ మార్కెట్ సైజ్ కూడా పెరిగింది కనుక… జక్కన్న ఈ కాన్సెప్ట్‌ని సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు. మొదట్లో బాలయ్యతో సోలో సినిమా చేద్దామనుకున్నా… అది కాస్తా ఇలా మల్టిస్టారర్‌గా మౌల్డ్ అయిందట. ట్రిపులార్ రిలీజ్ కాగానే… జక్కన్న క్యాంప్‌ నుంచి అఫీషియల్ కన్‌ఫర్మేషన్‌ వచ్చేదాకా ఇది అనఫీషియల్ న్యూస్ మాత్రమే. ఏదైతేనేం.. మల్టిస్టారర్ల ట్రెండ్‌ను వదిలిపెట్టేలా లేరన్న మాట జక్కన్న.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: డెలివరీ బాయ్‌గా మారిన హాస్యనటుడు.. వైరల్‌ అవుతున్న ఫొటో..!

Krithi Shetty: కలర్ ఫుల్ డ్రెస్సులో కవ్విస్తున్న కృతి లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Krithi Shetty : కోలీవుడ్‌కు కృతి శెట్టి.. సెన్సేషనల్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న బేబమ్మ..