Kavya Kalyanram: మెగా ఆఫర్ కొట్టేసిన బలగం బ్యూటీ.. ఆ హీరోకి జోడీగా కావ్య కళ్యాణ్ రామ్

|

Jun 04, 2024 | 9:14 AM

గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో నటించింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలోనూ కనిపించింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది ఇప్పుడు. ముసుదా సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో ఆమె నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత బలగం సినిమాలో చేసింది.

Kavya Kalyanram: మెగా ఆఫర్ కొట్టేసిన బలగం బ్యూటీ.. ఆ హీరోకి జోడీగా కావ్య కళ్యాణ్ రామ్
Kavya Kalyan Ram
Follow us on

చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించిన వారు ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కళ్యాణ్ రామ్. ఈ చిన్నది చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. ముఖ్యంగా గంగోత్రి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ చిన్నప్పటి రోల్ లో నటించింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బాలు సినిమాలోనూ కనిపించింది. ఇక ఈ అమ్మడు హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తుంది ఇప్పుడు. ముసుదా సినిమాతో హీరోయిన్ గా మారింది కావ్య కళ్యాణ్ రామ్. ఈ సినిమాలో ఆమె నటించిన అంతగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత బలగం సినిమాలో చేసింది.

నటుడు వేణు దర్శకత్వంలో తెరకెక్కిన బలగం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కావ్య తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఈసినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ మెప్పించింది ఈ చిన్నది. బలగం సినిమా తర్వాత కావ్య క్రేజ్ మారిపోయింది. ఈ అమ్మడిని బలగం బ్యూటీ అని పిలవడం మొదలు పెట్టారు. బలగం సినిమాతర్వాత  ఉస్తాద్ అనే సినిమాలో నటించింది కావ్య. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నదానికి ఓ బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ బబ్లీ బ్యూటీ మెగా హీరోతో జత కట్టనుందని తెలుస్తోంది. సాయి ధరమ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తేజ్ చివరిసారిగా బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు గాంజా శంకర్ అనే సినిమాచేస్తున్నాడు. ఈ సినిమాతర్వాత రోహిత్ అనే నూతన దర్శకుడితో తేజ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఈ సినిమాకు సంబ‌రాల ఏటి గ‌ట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తోంది. ఇది నిజంగా బలగం బ్యూటీకి బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. త్వరలోనే ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కావ్య రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

కావ్య కళ్యాణ్ రామ్ ఇన్ స్టా గ్రామ్..

కావ్య కళ్యాణ్ రామ్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.