Nagarjuna: మొత్తానికి సెట్టు భయ్యా..! నాగార్జునకు జోడీగా ఆ అందాల భామ ఫిక్స్.?

గతేడాది కుబేర, కూలీ సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించారు అక్కినేని నాగార్జున. అయితే ఈ రెండూ మల్టీ స్టారర్ సినిమాలే. పైగా వీటిలో నాగార్జున నెగెటివ్ రోల్స్ పోషించడం గమనార్హం. దీంతో నాగ్ ను మళ్లీ సోలో హీరోగా చూడాలని అక్కినేని ఫ్యాన్స్ బాగా కోరుకుంటున్నారు.

Nagarjuna: మొత్తానికి సెట్టు భయ్యా..! నాగార్జునకు జోడీగా ఆ అందాల భామ ఫిక్స్.?
Nagarjuna

Updated on: Mar 28, 2026 | 11:07 AM

కింగ్ నాగార్జున ఇప్పుడు రూటు మార్చారు. ఇన్నాళ్లు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ పాత్రలకు కూడా రెడీ అంటున్నారు. ఆమధ్య నేచురల్ స్టార్ నానితో కలిసి దేవదాస్ అనే సినిమాలో నటించారు నాగ్. మల్టీస్టారర్ కథతో తెరకెక్కిన ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇటీవలే ధనుష్ హీరోగా నాటింషన్ కుబేర సినిమాలో కీలక పాత్రలో నటించారు నాగ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కూలి సినిమాలో విలన్ గా అదరగొట్టారు. సినిమా నిరాశపరిచినప్పటికీ నాగార్జున నటనకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు నాగ్ మరోసారి హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ఇది. ఈ సినిమాను పక్కాగా ప్లాన్ చేస్తున్నారు.

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

ఈ క్రమంలోనే రా కార్తీక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాగ్. ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు నటిస్తుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఇప్పుడు నాగ్ కు జోడీగా ఓ అందాల భామను ఫిక్స్ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఆమె మరెవరో కాదు మన వెంకీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

ఇవి కూడా చదవండి

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్య భాగ్యంగా నటించి మెప్పించింది ఐశ్వర్య రాజేష్. ఈ అమ్మడు తెలుగమ్మాయి అయినప్పటికి తమిళ్ లో చెప్పుకోదగ్గ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈక్రమంలోనే నాగ్ 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత ఐశ్వర్య పెద్దగా ఆఫర్స్ అందుకోలేకపోతుంది.అలాంటి తరుణంలో నాగ్ సినిమా ఆఫర్ ఈ అమ్మడికి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us