ఈ ఏడాదిలో చాలా మంది మూవీ సెలబ్రెటీలు ఈఏడాది పెళ్లి పీటలెక్కారు. కొంతమంది విడాకులు తీసుకుంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. అలాగే కొంతమంది ప్రేమలోనూ పడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా ప్రేమలో పడిందని తెలుస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు , బ్రేకప్స్ కామన్ అయ్యాయి. అలాగే పెళ్లి చేసుకొని చాలా మంది విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ క్రేజీ హీరోయిన్ ప్రేమలో పడిందని తెలుస్తుంది. అది కూడా విడాకులు తీసుకున్న ఓ బడా సెలబ్రేటీతో ఈ ముద్దుగుమ్మ పెళ్లి జరగనుందని తెలుస్తుంది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరు.? ఆ విడాకులు తీసుకున్న సెలబ్రెటీ ఎవరు.?
ఈ అమ్మడు తెలుగులో చేసిన సినిమాలు తక్కువే కానీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. కుర్రాళ్ళ గుండెల్లో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు. కుర్ర హీరోలతో పాటు సీనియర్ హీరోలకు కూడా జోడీగా నటించింది ఈ వయ్యారి భామ. ఆమె స్నేహ ఉల్లాల్. 2007లో వచ్చిన నేను మీకు తెలుసా అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో మంచు మనోజ్ నటించాడు. ఆతర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
ఆతర్వాత ఆతర్వాత కరెంట్ సినిమాతో హీరోయిన్ గా చేసి మెప్పించింది. అలాగే బాలకృష్ణ హీరోగా నటించిన సింహ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. చివరిగా 2011లో మడత కాజా అనే సినిమా చేసింది. అల్లరి నరేష్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. స్నేహ ఉల్లాల్ ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కుమారుడితో ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతోందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే అతను అంతకు ముందే పెళ్ళై విడాకులు కూడా జరిగాయట.. అతను ఎవరు అనేది ఇంకా బయటకు రాలేదు.