రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు చాలా మంది హాజరయ్యారు. పైగా తండ్రి కానుండటం.. ఆస్కార్ రావడంతో ఈ సారి పుట్టిన రోజు చరణ్‌కు మరింత ప్రత్యేకంగా మారిపోయింది. అంతా బానే ఉంది కానీ ఈ వేడుకల్లో అల్లు అర్జున్ మిస్ అయ్యారు. చరణ్ బర్త్ డే వేడుకలో బన్నీ మిస్ అవ్వడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైపోయింది. పైగా ఈయన కనీసం ట్వీట్ కానీ.. ఇన్‌స్టాలో పోస్ట్ కానీ పెట్టలేదు. ప్రస్తుతం వియత్నాంలో ఉన్నారు అల్లు అర్జున్. పుష్ప 2 షెడ్యూల్‌కు కాస్త గ్యాప్ దొరకడంతో కుటుంబానికి సమయం కేటాయించారు బన్నీ. సిటీలో లేకపోవడంతో.. చరణ్ పుట్టిన రోజు వేడుకల్లో కనబడలేదు.. కానీ పర్సనల్‌గా విష్ చేసారని తెలుస్తుంది.
జూనియర్ ఎన్టీఆర్ సైతం బర్త్ డే వేడుకలకు రాలేదు. అసలే ఈ మధ్య తారక్, చరణ్ మధ్య గ్యాప్ పెరిగిందనే రూమర్స్ వస్తున్న వేళ.. ఎన్టీఆర్ ఆబ్సెన్స్ లేనిపోని అనుమానాలకు తావిస్తుంది. ఆ మధ్య ఆస్కార్ గెలిచిన సందర్భంలో చేసిన ట్వీట్‌లో చరణ్‌ను ట్యాగ్ చేయకపోవడం.. ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుకలో చరణ్ పేరు తీయకపోవడంతో చరణ్, తారక్ మధ్య ఏదో జరుగుతుందనే గాసిప్స్ మొదలయ్యాయి.
బర్త్ డే పార్టీకి రాకపోయినా.. హ్యాపీ బర్త్ డే మై బ్రదర్.. హావ్ ఏ బ్లాస్ట్ అంటూ ట్వీట్ చేసారు తారక్. హైదరాబాద్‌లోనే ఉన్నా.. వ్యక్తిగత కారణాలతోనే చరణ్ బర్త్ డే పార్టీకి రాలేదు తారక్. అంతే తప్ప ఇద్దరి మధ్య ఏం గ్యాప్ లేదంటున్నారు విశ్లేషకులు. కారణమేదైనా కావచ్చు.. ఇండస్ట్రీ అంతా వచ్చిన పార్టీలో తారక్, బన్నీ మిస్సింగ్‌పై కథనాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..