పొంగల్ ఫైట్ : మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ?

|

Oct 18, 2019 | 6:14 AM

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద మహేష్ బాబుతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో తెలిసిందే. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, తన అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందని అంటున్నాడు మహేష్. దర్శక నిర్మాతల మాటల్లోనూ ఇదే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ప్లాపు అంటూ ఎరగని కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై అటు నిర్మాత, హీరోకే ఆడియెన్స్‌కు కూడా 100 శాతం నమ్మకాలున్నాయ్. మరోవైపు […]

పొంగల్ ఫైట్ : మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ?
Follow us on

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా మీద మహేష్ బాబుతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకర ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారో తెలిసిందే. తన కెరీర్లోనే ఇది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, తన అభిమానులు గర్వపడేలా సినిమా ఉంటుందని అంటున్నాడు మహేష్. దర్శక నిర్మాతల మాటల్లోనూ ఇదే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటివరకు ప్లాపు అంటూ ఎరగని కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిపై అటు నిర్మాత, హీరోకే ఆడియెన్స్‌కు కూడా 100 శాతం నమ్మకాలున్నాయ్.

మరోవైపు ‘అల వైకుంఠపురములో’ చిత్ర బృందం కాన్ఫిడెన్స్ కూడా మామూలుగా లేదు. అది నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇక అరవింద సమేతతో ఫామ్‌లోకి వచ్చిన గురూజి..ఈ సినిమాను ఓ రేంజ్‌ తీస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ప్రస్తుతం ఈ జోడి హ్యట్రిక్‌పై కన్నేశారు. ఇక రెండు సినిమాల మేకర్స్ ఫలితం మీద చాలా ధీమాగా ఉన్నారు.

సంక్రాంతి సీజన్‌లో అయిదు రోజుల పాటు వసూళ్లు అదిరిపోతాయి. అవి కాకుండా శని, ఆదివారాలు, రిలీజ్‌ డే కలుపుకుని ఏ సినిమాకి అయినా చాలా అడ్వాంటేజీ వుంటుంది. అందుకే ఈ సీజన్‌లో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు అంతగా పోటీ పడుతుంటారు. ఈసారి సంక్రాంతికి ముందు వీకెండ్‌ బాగా సెట్‌ అయింది. అయితే సెంటిమెంట్‌‌తో పాటు వివిధ క్యాలుక్లేషన్స్ వల్ల..శుక్రవారం, అంటే జనవరి 10న సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండూ విడుదల చేయకూడదని ఫిక్స్‌ అయ్యారు. ఒకదాని ప్రభావం మరొక దాని మీద పడి ఎక్కడ వసూళ్లు ప్రభావితం చెందుతాయో అని బయ్యర్లు ఖంగారు పడుతున్నారు. నిర్మాతలు తీసుకుంది కరెక్ట్ నిర్ణయం కాదన కొంతమంది ట్రేడ్ పండితులు అభిప్రాయం.

ఇక సూపర్ స్టార్, స్టైలిశ్ స్టార్‌ లలో ఎవరిది పైచేయి అవుతంతా అన్న ఉత్కంఠ సాగుతోంది. ఓపెనింగ్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఎవరికి ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.దీని మీద సోషల్ మీడియాలో మాంచి చర్చ నడుస్తోంది.మాకంటే..మాకంటూ ఇరు హీరోల ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. అసలు విషయానికి వస్తే..మహేశ్ వివాదరహితుడు..అందునా మెగాస్టార్‌తో హెల్దీ రిలేషన్‌షిప్ మెయింటేన్ చేస్తాడు. మొన్నీమధ్య సైరా రిలీజైనప్పుడు కూడా స్టార్ హీరోస్‌లో మహేశ్ బాబే మొదట రెస్పాండ్ అయ్యాడు. ఇక బన్నీ.. మెగాస్టార్‌ని ఏ రేంజ్‌లో ఆరాధిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ పవన్ స్టార్‌ విషయంలో వచ్చిన చిన్నపాటి మిస్ అండర్‌స్టాండింగ్ నా పేరు సూర్య రిలీజ్ టైం‌లో అల్లు అర్జున్‌ని కాస్త ఇబ్బందిపెట్టింది. ఆ తర్వాత బన్నీనే స్వయంగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతా ఫైన్. మరి మెగా వేవ్ ఎటు మళ్లుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.