తెలుగు ఆడియన్స్‌కు తమిళ దీపావళి!

తమిళ హీరోలు తెలుగులో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే తమిళ డబ్బింగ్ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో వాళ్ళు ప్రతిసారి ప్లాప్స్ చవి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి తమిళ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఈ దీపావళికి తమిళంలో రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. సేమ్ టైం అవి తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. […]

తెలుగు ఆడియన్స్‌కు తమిళ దీపావళి!
Follow us

|

Updated on: Oct 18, 2019 | 5:21 PM

తమిళ హీరోలు తెలుగులో తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే తమిళ డబ్బింగ్ చిత్రాలపై తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో వాళ్ళు ప్రతిసారి ప్లాప్స్ చవి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మరోసారి తమిళ హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌పై దండయాత్ర చేస్తున్నారు. ఈ దీపావళికి తమిళంలో రెండు భారీ చిత్రాలు విడుదల కానున్నాయి. సేమ్ టైం అవి తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఇక తెలుగులో ఒక్క స్ట్రెయిట్ సినిమా కూడా పండగ బరిలో లేకపోవడం వల్ల ఈ రెండు సినిమాలకు కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ చిత్రాల బలాబలాలను ఓ సారి చూసుకుంటే..

1.బిగిల్(తెలుగులో ‘విజిల్’):

దళపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘బిగిల్’. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై యూట్యూబ్ రికార్డ్స్‌ను బద్దల కొడుతోంది. రెండు విభిన్న పాత్రల్లో విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకు ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అంతేకాక ఈ చిత్రం తెలుగు హక్కులు దాదాపు 10 కోట్లు పలికినట్లు తెలుస్తోంది. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 25న రెండు భాషల్లోనూ విడుదల కానుంది. ‘మెర్సల్’, ‘తేరి’ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

2.ఖైదీ:

కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఖైదీ’. ఈ సినిమా కూడా అక్టోబర్ 25న రెండు భాషల్లోనూ విడుదల కానుంది. హీరోయిన్, సాంగ్స్ అనేవి లేకుండా రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. దాదాపు 84 రోజులు చీకటిలోనే ఈ సినిమా తెరకెక్కడం విశేషం. కొంతకాలంగా కార్తీ ప్లాప్స్‌తో సతమతమవుతున్నాడు. ఈ సినిమా సక్సెస్ అతడికి చాలా ముఖ్యం. ఇటీవల విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కంటెంట్ పరంగా విషయం ఉన్న ఈ మూవీ.. అభిమానులను ఏమేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

ఈ రెండు చిత్రాలు తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టేలా కనిపిస్తున్నాయి. ఇవాళ తెలుగులో విడుదలైన సినిమాలకు పెద్దగా బజ్ లేకపోవడంతో వీటి మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడదు. ఈసారైనా తమిళ హీరోలకు తెలుగులో హిట్స్ దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే.