
సినిమా రంగుల ప్రపంచంలో తన మొదటి సినిమాకే జాతీయ అవార్డ్ గెలుచుకున్నాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను చూశారు. రాత్రిళ్లు వాచ్ మెన్ గా వర్క్ చేశాడు. పగలు ఇస్త్రీ పని చేసి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డాడు. కానీ సినిమా అనే సముద్రంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాడు. అతడే డైరెక్టర్ నాగరాజ్ మంజులే. ఈ పేరు సినీప్రియులకు అంతగా తెలియదు. కానీ అతడు రూపొందించిన సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అతడు మరాఠీ చిత్రపరిశ్రమ ముఖ చిత్రాన్న మార్చేశాడు. అతడు తెరకెక్కించిన సైరత్ సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
నాగరాజు మంజులే సినీప్రయాణం అంత సులభంగా లేదు. 1977 ఆగస్టు 24న షోలాపూర్‌లోని కర్మల తాలూకాలోని జెయుర్ గ్రామంలో జన్మించిన నాగరాజ్ మంజులే చిన్నప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, పేదరికాన్ని చూశాడు. కుటుంబం సంప్రదాయం ప్రకారం 12వ తరగతిలోనే వివాహం చేసుకున్నాడు. చదువుపై పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ.. సినిమాలవైపు అడుగులు వేశాడు. తన స్కూల్ బ్యాగ్‌ను స్నేహితుడి వద్ద వదిలి సినిమాలకు వెళ్లేవాడు. తన కుటుంబంలో అత్యధిక విద్యావంతుడు నాగరాజ్ ఒక్కడే. ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేశాడు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
కానీ సినిమా పై ఆసక్తితో మాస్ కమ్యూనికేషన్‌లో ఒక కోర్సు చేశాడు. అదే సమయంలో పిస్టోల్య అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించాడు. అది జాతీయ అవార్డ్ గెలుచుకుంది. అతడికి కవిత్వం రాయడం అంటే ఇష్టం. 2013లో ఫ్రెండీ సినిమాకు జాతీయ అవార్డ్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత సైరత్ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం 69వ జాతీయ అవార్డును గెలుచుకుంది.
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..