National Film Award Movies in OTT: భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను గురువారం (ఆగస్టు 24)న సాయంత్ర ప్రకటించారు. 2021 ఏడాదికి గానూ ఈ పురస్కారాలను ప్రకటించారు. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ వేదికగా అనౌన్స్ చేసిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఈ సారి తెలుగు సినిమాల హవా నడిచింది. పుష్ప సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు అల్లు అర్జున్. ఈ సినిమాకే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అవార్డును అందుకోనున్నాడు దేవిశ్రీప్రసాద్. ఇక పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు తిరగరాసిన ఆర్‌ఆర్‌ఆర్ ఏకంగా ఆరు అవార్డులు కైవసం చేసుకుంది. అలాగే బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన, క్రిష్ దర్శకత్వం వహించిన కొండపొలం సినిమాలు కూడా వివిధ విభాగాల్లో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెల్చుకున్నాయి. ఇక బాలీవుడ్ నుంచి అలియా భట్, కృతిసనన్ ఉత్తమ నటీమణులుగా జాతీయ పురస్కారాలు అందుకోనున్నారు. ఇదే క్రమంలో బెస్ట్ మూవీగా నంబి.. ది రాకెట్రీ నిలవగా.. ది కశ్మీర్ ఫైల్స్ కు జాతీయ సమగ్రతపై తీసిన బెస్ట్ మూవీగా నర్గీస్ దత్ పురస్కారం లభించింది. కాగా జాతీయ అవార్డులు గెలిచిన సినిమాలన్నీ ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏ సినిమా ఉందో తెలుసుకుందాం రండి.
.@ThisIsDSP pic.twitter.com/6Cxsf0eLJj
ఇవి కూడా చదవండి— prime video IN (@PrimeVideoIN) August 24, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..