ఈ నగరానికి ఏమైంది నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen). మొదటి సినిమానుంచి తన యాటిట్యూడ్ తో నటనతో ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కళ్యాణం అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్‌వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అశోకవనంలో అర్జున కళ్యాణం మే6 విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా చేయాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. తను ఇప్పటి వరకు చేసిన సినిమాలకు భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు.
ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా హిలేరియస్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్ చిత్రానికి.. సూపర్ హిట్ మూవీ ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. విద్యా సాగర్ చింతా చిత్రాన్ని తెరకెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. పవి కె.పవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విప్లవ్ ఎడిటర్. ప్రవల్య దుడ్డిపూడి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :